Begin typing your search above and press return to search.

రెడ్ హ్యాండెడ్ గా దొరికిన దీపిక జంట

By:  Tupaki Desk   |   2 Aug 2018 1:33 PM GMT
రెడ్ హ్యాండెడ్ గా దొరికిన దీపిక జంట
X
బాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ సెలబ్రిటీ మ్యారేజ్ గా వార్తల్లో ఉన్న దీపికా పదుకునే-రన్ వీర్ సింగ్ లు త్వరలో జరగబోయే పెళ్లి కబురును స్వయంగా షేర్ చేసుకోవడం లేదు కానీ ఎప్పటికప్పుడు తమ ట్రిప్పుల ద్వారా బయట పెడుతూనే ఉన్నారు. బాలీవుడ్ మీడియా ఈ ఇద్దరి వ్యవహారం గురించి గత నాలుగేళ్లుగా కోడై కూస్తున్నా అఫీషియల్ ప్రకటన మాత్రం ఇంతవరకు రాలేదు. తాజాగా అమెరికా ఓర్లాండోలో ఉన్న డిస్నీ ల్యాండ్ పర్యటనలో ఉన్న దీపికా రన్వీర్ లు అక్కడ చక్కర్లు కొడుతుండగా కొందరు సెల్ ఫోన్స్ లో వీడియో షూట్ చేసి సోషల్ మీడియాలో పెట్టేయడంతో విషయం ప్రపంచానికి తెలిసిపోయింది. నిజానికి ఈ ఇద్దరు అక్కడ ఉన్నట్టు ఎవరికి తెలియదు కుటుంబ సభ్యులకు తప్ప. కానీ డిస్నీ ల్యాండ్ ప్రపంచవ్యాప్త పర్యాటకులు వచ్చే ప్రదేశం కాబట్టి సహజంగానే అక్కడికి వచ్చిన ఇండియన్స్ ఈ జంటను గుర్తు పట్టేసి గుట్టు చూపించేసారు. '

అన్నట్టు ఈ ఇద్దరితో పాటు దీపికా చెల్లెలు అనీషా పదుకునే కూడా ఉండటం విశేషం. ప్రీ వెడ్డింగ్ షాపింగ్ అండ్ వెకేషన్ లో భాగంగానే అక్కడికి వెళ్లి ఉంటారని గుసగుసలు మొదలయ్యాయి. నవంబర్ 10న వెడ్డింగ్ డేట్ గా లాక్ చేసి ఇటలీలో చాలా పరిమితంగా పిలిచిన అతిధుల మధ్య సింపుల్ గా ఈ వేడుక జరిపించాలని డిసైడ్ అయ్యారట. కానీ మీడియాకు లీక్ కాకుండా హంగామా లేకుండా జరిపించబోతున్నారని సమాచారం. రిసెప్షన్ మాత్రం అనుష్క శర్మ తరహాలో ఇక్కడే చేసే అవకాశాలు ఉన్నాయి. రన్ వీర్ సింగ్ ప్రస్తుతం గల్లీ బాయ్ తో పాటు టెంపర్ రీమేక్ సింబాలో నటిస్తున్నాడు. పెళ్లి టైంకి ఆ రెండు షూటింగ్స్ పూర్తయ్యేలా ప్లానింగ్ చేసుకున్నాడట. దీపికా మాత్రం వెన్ను నొప్పి కారణంగా రెస్ట్ తీసుకున్నాక కొత్త సినిమా ఏది సైన్ చేయలేదు. రిసెప్షన్ బెంగుళూరు-ముంబైలో రెండు సార్లు జరిపేలా ప్రణాళిక ఉందని వినికిడి.