Begin typing your search above and press return to search.
అనుష్క తర్వాత దీపికానా?
By: Tupaki Desk | 4 Jan 2018 12:31 PM GMTవిరాట్ కోహ్లీ-అనుష్క శర్మ పెళ్లి - రిసెప్షన్ అన్ని అయిపోయి కొత్త జంట క్రికెట్ టూర్ కోసం సౌత్ ఆఫ్రికా కూడా వెళ్ళిపోయారు. ఇక తర్వాత క్యూ లో ఎవరున్నారు అని ఎదురు చూస్తున్న వాళ్ళకు మరో కొత్త జంట దొరికినట్టు కనిపిస్తోంది. రన్వీర్ సింగ్ - దీపికా పదుకునేల మధ్య చాలా సీరియస్ లవ్ ట్రాక్ నడుస్తోంది అని గత కొన్నేళ్ళుగా బాలీవుడ్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతోంది. ఇద్దరు కలిసి జంటగా వరసగా సినిమాలు రావడం కూడా ఈ అనుమానాన్ని ఇంకా బలంగా మార్చింది. రన్వీర్ సింగ్ కాని - దీపికా కాని దీని గురించి ఎప్పుడు బయట మాట్లాడింది లేదు. ఎవరైనా గుచ్చి గుచ్చి అడిగినా అబ్బే అలాంటిది ఏమి లేదు అని స్పష్టంగా చెబుతూ వచ్చారు. ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్త చదివితే ఆశ్చర్యం కలగక మానదు.
రన్వీర్ సింగ్ - దీపికా పదుకునే త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అనేది దాని సారాంశం. రేపు అంటే జనవరి 4 దీపికా పుట్టిన రోజు సందర్భంగా శ్రీలంకలో ఈ ఇద్దరికీ నిశ్చితార్థం జరగబోతోంది అని కూడా ఆ వార్తకు జత చేసారు. ఇప్పటికే న్యూ ఇయర్ వేడుకల కోసం మాల్దీవ్స్ లో ఉన్న ఈ ఇద్దరు ఫ్యామిలీస్ తో సహా అక్కడ కలవబోతున్నారు అని టాక్. ఇది జరిగాక పెళ్లి డేట్ గురించి నిర్ణయం తీసుకుంటారని అందులో ప్రచారం చేస్తున్నారు. గతంలో విరాట్-అనుష్కల విషయంలో కూడా ఇలాంటి వార్తలే వస్తే అవి నిజమయ్యాయి కూడా. మరి ఇప్పుడు వచ్చిన ఈ గాసిప్ నిజమో కాదో తెలియాలంటే మరో రోజు ఆగి చూడాలి. దీపికా, రన్వీర్ నటించిన జంటగా నటించిన పద్మావతి విడుదల కోసం ఎదురు చూస్తోంది,