Begin typing your search above and press return to search.
వాళ్లిద్దరూ పెళ్లికి రెడీ
By: Tupaki Desk | 28 May 2018 10:21 AM GMTబాలీవుడ్ లో గాసిప్ కాలమ్స్ లో కనిపించే టాప్ హీరోయిన్ లలో చాలామంది పెళ్లి చేసుకుని లైఫ్ పార్టనర్లతో సెటిలైపోయారు. చాలా రోజులుగా ఎక్కువ మంది నోళ్లలో వినిపిస్తోంది రణ్ వీర్.. దీపికా పదుకునేల జంట పేరే. వీళ్లిద్దరి ప్రేమాయణంపై ఇప్పటికి రకరకాల మాటలు వినిపించాయి. తమ బంధం గురించి వీళ్లిద్దరూ ఎప్పుడూ ఓపెన్ గా ఒప్పుకోలేదు. అలాగని ఈ కామెంట్స్ ను గట్టిగా ఖండించింది లేదు.
వీళ్లిద్దరి రిలేషన్ షిప్ కు సంబంధించి బాలీవుడ్ లో ఓ లేటెస్ట్ న్యూస్ వైరల్ గా మారింది. అదేంటంటే ఈ జంట త్వరలోనే పెళ్లికి రెడీ అవుతోందట. ఈమధ్యనే బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ - క్రికెటర్ విరాట్ కోహ్లీ ఫారిన్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. తిరిగి ఇండియాకకు వచ్చాక అందరికీ కళ్లు చెదిరే పార్టీ ఇచ్చారు. ఇదే స్టయిల్ లో ఈ ఏడాది నవంబర్ లో వీళ్లిద్దరూ పెళ్లి బంధంలోకి అడుగు పెట్టే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. పెళ్లికి అతిథులను పరిమితంగా ఆహ్వానించి ఆ తరవాత అందరికీ మంచి విందు ఇచ్చేలా మ్యారేజ్ వేడుకను ప్లాన్ చేస్తున్నారని లేటెస్ట్ బాలీవుడ్ టాక్.
తమ రొమాన్స్ లాగే పెళ్లి గురించి అడిగినా రణ్ వీర్ - దీపికా పెదవి విప్పి ఒక్క మాట కూడా చెప్పలేదు. కాకుంటే దీపికా ఈ రెండు నెలల్లో ఒక్క సినిమా కూడా ఓకే చెప్పలేదు. ఇప్పుడు సినిమా ఓకే చేస్తే నవంబర్ నాటికి షూటింగ్ బిజీలో ఉండిపోవాల్సి వస్తుందనే కారణంతోనే దీపికా ఆఫర్లన్నింటినీ పక్కన పెడుతోందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు.