Begin typing your search above and press return to search.

పెళ్లి డేట్‌ ను ప్రకటించిన స్టార్‌ ప్రేమ జంట

By:  Tupaki Desk   |   21 Oct 2018 12:15 PM GMT
పెళ్లి డేట్‌ ను ప్రకటించిన స్టార్‌ ప్రేమ జంట
X
బాలీవుడ్‌ లో గత కొన్నాళ్లుగా స్టార్‌ హీరోయిన్‌ దీపిక పదుకునే, రన్‌ వీర్‌ సింగ్‌ లు ప్రేమించుకుంటున్నట్లుగా ప్రచారం జరుగుతున్న విషయం తెల్సిందే. వీరిద్దరి వివాహం అదుగో, ఇదుగో అంటూ అప్పుడప్పుడు మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇద్దరి వివాహం అయ్యిందని కూడా ఒకటి రెండు సార్లు పుకార్లు షికార్లు చేశాయి. ఎవరు ఎంతగా ప్రశ్నించినా కూడా ఈ స్టార్‌ ప్రేమ జంట మాత్రం పెళ్లి విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. ఎట్టకేలకు వీరి ప్రేమ పెళ్లికి రంగం సిద్దం అయ్యింది. ఈ విషయాన్ని స్వయంగా వారిద్దరు ప్రకటించారు.

కేవలం పెళ్లి ప్రకటన మాత్రమే కాదు, పెళ్లి తేదీతో ఒక ఆహ్వాన పత్రిక కూడా దీపిక, రన్‌ వీర్‌ లు విడుదల చేయడం జరిగింది. మా రెండు కుటుంబాల ఆశ్వీర్వాదంతో మేమిద్దరం పెళ్లికి సిద్దమయ్యాం. నవంబర్‌ 14 మరియు 15వ తేదీల్లో మా వివాహం జరుగబోతుంది. మీ ప్రేమ అభిమానాలను ఇన్నాళ్లుగా చూపిస్తూ వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. మీ ఆశీర్వాదం కూడా మాకు కావాలి అంటూ ఈ జంట ఆహ్వాన పత్రికలో కోరడం జరిగింది.

పెళ్లికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే వెళ్లడి చేయబోతున్నారు. పెళ్లి జరిగేది ఎక్కడ, గెస్ట్‌ లు ఎంతమంది, ఏ పద్దతిలో పెళ్లి జరగబోతుందా అంటూ ప్రస్తుతం బాలీవుడ్‌ తో పాటు దేశ వ్యాప్తం చర్చ జరుగుతుంది. దీపిక పలువురితో ప్రేమ వ్యవహారం నడిపించిందనే పుకార్లు షికార్లు చేశాయి. కాని అవన్ని ఒట్టి పుకార్లే అని తేలిపోయి, చివరగా రన్‌ వీర్‌ ను ఆమె వివాహం చేసుకునేందుకు సిద్దం అయ్యింది. వీరిద్దరు కలిసి పలు చిత్రాల్లో నటించడంతో పాటు, కలిసి జీవించడం ఇప్పటికే ప్రారంభించారనే టాక్‌ బాలీవుడ్‌ లో వినిపిస్తుంది.