Begin typing your search above and press return to search.

అందాల భామ సారీలు చెబుతుంటే..

By:  Tupaki Desk   |   28 May 2018 4:41 AM GMT
అందాల భామ సారీలు చెబుతుంటే..
X
అందగత్తెలు ఏం చేసినా అందంగానే ఉంటుంది. కాకపోతే ఏదైనా పెద్ద ఈవెంట్ లో వారు లేకపోతే మాత్రం ఆ లోటు కొట్టొచ్చినట్లు కనిపిస్తూ ఉంటుంది. రీసెంట్ గా బాలీవుడ్ బ్యూటీ సోనమ్ కపూర్ తన ప్రియుడు ఆనంద్ అహూజాను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.

ఈ కార్యక్రమానికి అనేకమంది సినీ ప్రముఖులు వచ్చారు కానీ.. బాలీవుడ్ టాప్ బ్యూటీ దీపికా పదుకొనే మాత్రం కనిపించలేదు. ఏదో పని హడావిడిలో రావడం కుదరలేదులే అని అంతా అనుకున్నారు.. వదిలేశారు. కానీ తను ఆ వేడుకకు రాని విషయాన్ని దీపిక మాత్రం బాగానే గుర్తు పెట్టుకుంది. దీనిపై సోనమ్ తండ్రి అనిల్ కపూర్ కు ఓ క్లారిటీ కూడా ఇచ్చేసింది. రీసెంట్ గా వీరిద్దరూ జీక్యూ మేగజైన్ నిర్వహించిన ఓ ఈవెంట్ కు అటెండ్ అయ్యారు. ఒక్కడ అనిల్ కపూర్ తనకు ఎదురుపడగానే.. తనే వెళ్లి ఆప్యాయంగా ఓ హగ్ ఇచ్చి మరీ పలకరించింది దీపిక.

సోనమ్ పెళ్లి సమయంలో తాను ఇండియాలో లేనని.. కేన్స్ ఫెస్టివల్ కోసం వెళ్లాల్సి వచ్చిందని అందుకే రాలేకపోయానని దీపికా పదుకునే తన అపాలజీ చెప్పింది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ఇంటర్నెట్ లో తెగ వైరల్ గా చక్కర్లు కొడుతోంది. దీపిక లాంటి అందాల భామ సారీలు చెబుతుంటే.. భలే చూడముచ్చటగా ఉందని కామెంట్స్ వినిపిస్తున్నాయి.