Begin typing your search above and press return to search.
పార్వతి పాత్రలో దీపికా పదుకొణె
By: Tupaki Desk | 19 July 2022 3:30 AM GMTరణబీర్ కపూర్ - అలియా భట్ నటించిన `బ్రహ్మాస్త్ర` ట్రైలర్ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. వీఎఫ్ ఎక్స్ మాయాజాలంతో భారీతనం నిండిన సినిమా ఇది. ఇటీవలి పాన్ ఇండియా సినిమాల వెల్లువలో `యూనివర్శ్` కాన్సెప్టుతో వస్తున్న ట్రయాలజీ చిత్రమిది.
మొదటి భాగం విజయవంతమైతే దర్శకుడు అయాన్ ముఖర్జీ `బ్రహ్మాస్త్ర` విశ్వాన్ని భారీగా ప్లాన్ చేయాలని ఆలోచిస్తున్నారు. ఈ విశ్వంలో రణబీర్ పాత్రతో పాటు అనేక పాత్రలు స్పిన్ ఆఫ్ (కొత్తవి చేరుతాయి) అవుతాయి. అయాన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అలాంటి ప్లాన్ తనకు ఉందని స్వయంగా ధృవీకరించాడు. ఈ చిత్రం రెండవ భాగంలో `దేవ్` అనే కొత్త పాత్రను పరిచయం చేయనున్నట్లు కూడా టాక్ వినిపిస్తోంది. పురాణేతిహాసాల నుంచి పుట్టుకొచ్చిన ఈ కథలో అనేకానేక పార్శ్యాలను స్పర్శిస్తూ యూనివర్శ్ తరహా సినిమాలను రూపొందించనున్నారు.
`బ్రహ్మాస్త్ర 2` మహాదేవ్ - పార్వతి అనే రెండు కీలక పాత్రలతో తెరకెక్కేందుకు ఛాన్సుందని తాజాగా రివీలైంది. పార్వతి పాత్రను పోషించడానికి మేకర్స్ దీపికా పదుకొణెని లాక్ చేసారని కూడా గుసగుస వినిపిస్తోంది. నిజానికి దీపికా బ్రహ్మాస్త్ర-1 క్లైమాక్స్ లో ఒక అతిధిగా కనిపిస్తుంది. బ్రహ్మాస్త్ర రెండవ భాగంలోకి ఈ పాత్ర తీసుకువెళుతుందని సోర్స్ వెల్లడించింది. బ్రహ్మాస్త్ర 1: `శివ` కోసం వెతికే యువకుడి కథ.. కానీ రెండో భాగం అందుకు భిన్నమైనది.
రెండో భాగంలో మహాదేవ్ గా నటించడానికి మేకర్స్ ఒక యువనటుడిని లాక్ చేసారని కూడా తెలిసింది. ఆసక్తికరంగా మొదటి భాగంలో శివ గురించి చూపిస్తుంటే రెండో భాగంలో పార్వతి పై ఎక్కువ ఫోకస్ చేస్తారని తెలిసింది. ఇషా అనేది `మహాదేవ్- పార్వతి`కి మరొక పేరు.
ఈ అన్ని పాత్రలు ఒకదానితో ఒకటి అనుసంధానమై తెరపై కనిపిస్తాయి. ఇది భారతీయ పురాణేతిహాసల నుంచి ఎంచుకున్న గొప్ప కథలతో అయాన్ ముఖర్జీ సృష్టించిన సొంత విశ్వం. ట్రైలర్ లో ఇంతకు ముందు చూసినట్లుగా ఈ ప్రపంచం భిన్నంగా ఉంటుంది. కొత్తగా ఉంటుంది. శివ - ఇషా కూడా ట్రయాలజీలో అన్ని భాగాలలో కొనసాగుతారు. షారుఖ్ ఖాన్ కూడా బ్రహ్మాస్త్ర 1లో అతిథి పాత్రలో కనిపిస్తారు. కింగ్ ఖాన్ కొన్ని ప్రత్యేక సూపర్ పవర్స్ తో సుదీర్ఘమైన యాక్షన్ సన్నివేశంలో కనిపిస్తారు. టాలీవుడ్ కింగ్ నాగార్జున కూడా ఒక కీలక పాత్రతో మెరిపిస్తారు.
మొదటి భాగాన్ని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారనే దానిపైనే బ్రహ్మాస్త్రా ఫ్రాంచైజీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం అయాన్ ముఖర్జీ వద్ద పార్ట్ 2 .. పార్ట్ 3 లకు బ్లూప్రింట్ సిద్ధంగా ఉంది. మొదటి భాగం విజయవంతమైతే అతడు 2023 చివరి నాటికి రెండవ భాగాన్ని సెట్స్ పైకి తీసుకెళతాడు. అలాగే పార్ట్ వన్ ఫలితంపై టీమ్ నమ్మకంగా ఉంది. బ్రహ్మాస్త్ర ఒక ప్రత్యేకమైన యూనివర్శ్ ని సృష్టించే ప్రయత్నం .. ఇది ఒక సవాల్ లాంటిది. టీమ్ ఇప్పటికే సాంకేతికతను అర్థం చేసుకుని మొదటి భాగాన్ని రూపొందించింది. అందువల్ల సీక్వెల్ చేయడానికి పట్టే సమయం తగ్గుతుందని కూడా చెబుతున్నారు. 9 సెప్టెంబర్ 2022న మొదటి భాగం విడుదల కానుంది. హిందీ- తమిళం- తెలుగు- మలయాళం -కన్నడ భాషల్లో ఇది అత్యంత భారీగా విడుదల కానుంది.