Begin typing your search above and press return to search.

వాళ్లిద్దరూ కలిసే అవకాశమే లేదా?

By:  Tupaki Desk   |   15 May 2018 5:07 AM GMT
వాళ్లిద్దరూ కలిసే అవకాశమే లేదా?
X
ప్రస్తుతం కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో రెడ్ కార్పెట్ పై హీరోయిన్లు తమ అందచందాలతో మెరుపులు మెరిపిస్తున్నారు. హాలీవుడ్ భామలకు ఏ మాత్రం తీసిపోని విధంగా బాలీవుడ్ బ్యూటీలు అదిరిపోయ్ స్టయిల్ తో.. కళ్లు చెదిరే ఫ్యాషన్ తో రెడ్ కార్పెట్ పై వయ్యారాలు వలకబోస్తున్నారు. ఐశ్వర్య రాయ్ బచ్చన్ - కంగన రనౌత్ - హ్యూమా ఖురీషి - దీపికా పదుకునే ఈసారి కేన్స్ లో తమ హొయలతో సందడి చేస్తున్నారు.

కేన్స్ లో మిగతా భామల సంగతి అటుంచి దీపికా రెడ్ కార్పెట్ పై నడిచిన టైంలో ఆమెను చూసినవాళ్లంతా ఆమె మెడ వెనుక కనిపించాల్సిన టాటూ మిన్సయిన విషయం గుర్తు పట్టేశారు. గతేడాది కేన్స్ లో దీపిక మెడ వెనుక భాగాన ఆర్.కె. అనే అక్షరాలతో డిజైనర్ టాటూ అందరి దృష్టిని ఆకర్షించింది. అప్పట్లో రణ్ బీర్ కపూర్ తో దీపిక రిలేషన్ షిష్ లో ఉందనే మాటలు వినిపించాయి. ఆమె ఒంటిపై కనిపించిన టాటూతో చాలామంది వాళ్లిద్దరి మధ్య బంధాన్ని కన్ఫర్మ్ చేసుకున్నారు.

ఏడాది కాలంలో దీపిక - రణ్ బీర్ ల మధ్య పొరపొచ్చాలు రావడంతో వాళ్లిద్దరూ దూరమయ్యారు. ఒకరికొకరు బ్రేకప్ కూడా చెప్పేసుకున్నారనే టాక్ వినిపించింది. బాలీవుడ్ లో చాలా జంటల్లాగే తిరిగి కనిపిస్తారని అంతా ఆశించారు. కానీ అలాంటిది ఈసారి దీపిక ఒంటిపై ఆర్.కె. టాటూ కనిపించలేదు. ఆ టాటూను లేజర్ ట్రీట్ మెంట్ తో తీయించుకుందనే మాట వనిపిస్తోంది. దీంతో రణ్ బీర్ - దీపికాలు పర్మినెంట్ గా దూరమయ్యారని.. వాళ్లిద్దరూ కలిసే అవకాశం లేదని ఫిక్సయిపోవచ్చు.