Begin typing your search above and press return to search.

వైట్ లో వయ్యారంగా చంపేసిందిగా

By:  Tupaki Desk   |   25 Jun 2016 4:58 AM GMT
వైట్ లో వయ్యారంగా చంపేసిందిగా
X
ఐఫా 2016కు దీపిక స్పెయిన్ లో వాలిపోయిన విషయం పాత సంగతే. అక్కడ చిందులేయడానికి నిమిషానికి 33 లక్షలు ఛార్జ్ చేసినదీ విషయమూ అంతే. అయితే కొత్త కబురు ఏంటంటే.. దీపికా పదుకొనే అక్కడ డ్యాన్సులతో పాటు ఫ్యాన్స్ ని మైమరిపించే ప్రోగ్రామ్ కూడా పెట్టేసుకుంది. అదెలా ఉంటుందో ట్రయల్ చూపించడం కోసం అనుకుంటా.. వైట్ టాప్ లో పోజులిచ్చి ఆ ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.

పర్ఫెక్ట్ షేప్ బాడీ.. అరకొరగా కనిపిస్తున్న క్లీవేజ్.. తొడలు కనిపించేలా డ్రసింగ్.. అన్నిటికీ మించి ఛాతీపై కనిపించే బ్యూటీ స్పాట్.. వీటన్నిటితో తన దగ్గరే బోలెడన్ని వయ్యారాల నగలు ఉండగా.. వేరే ఆభరణాలు ఎందుకు అనుకుందేమో.. మెడకి ఓ సింపుల్ నెక్ చైన్ మాత్రమే ధరించింది. చూసేవాళ్లకి పిచ్చెక్కించేలా తెగ పోజులు కూడా ఇచ్చేసింది. ఇంతకీ అమ్మడి డ్రెస్ డిజైనర్ ఎవరో గానీ.. ఓ సారి కనిపించి గాట్టిగా వాటేసుకోవాల్సిందే.

అప్పుడెప్పుడో రాజేంద్రప్రసాద్ ఓ సినిమాలో గాలి బొక్కల చొక్కా అనే పదప్రయోగం చేస్తాడు. అంటే ఎయిర్ ఫ్రీ షర్ట్ అన్నమాట. షర్ట్ అంతా కన్నాలు పెట్టేసి అలా పిలుస్తాడు మన నటకిరీటి. ఇప్పుడు దీపిక డ్రసింగ్ చూస్తే.. ఆ గాలి బొక్కల చొక్కా గుర్తురావడంలో(ఆ ఒక్కటి అడక్కు చూసినోళ్లకి మాత్రమే) ఏమాత్రం తప్పులేదు. అన్నేసి అందాలను.. ఆ ఎయిర్ ఫ్రీ టాప్ ఆ రేంజ్ లో ఆరేస్తోంది మరి.