Begin typing your search above and press return to search.

24 గంటల్లో 24 యాసిడ్ బాటిల్స్ కొన్న టాప్ నటి

By:  Tupaki Desk   |   16 Jan 2020 4:32 AM GMT
24 గంటల్లో 24 యాసిడ్ బాటిల్స్ కొన్న టాప్ నటి
X
బాలీవుడ్ హీరోయిన్లకు కాస్త భిన్నం దీపికా పదుకునే. పొడుగు కాళ్ల సుందరి.. బోల్డ్ గా నటించేస్తుంది లాంటి బిరుదులు ఆమెకున్నా.. ఆమెలో మరో కోణం ఉంది. ఉన్న నిజాన్ని ఉన్నట్లు చెప్పేయటం. తాను కుంగుబాటుకు గురైన విషయం కావొచ్చు. పెళ్లైన తర్వాత కూడా తన లవ్ మ్యాటర్ తననెంతగా ఇబ్బంది పెడుతుందో అన్న విషయాలే కాదు.. జేఎన్ యూలో ఇటీవల దాడి జరిగితే.. నేరుగా వెళ్లిన వైనం ఆమెను ప్రత్యేకంగా నిలిపేలా చేస్తాయి.

తాజాగా ఆమె చేసిన చపాక్ విడుదలైంది. విమర్శకుల ప్రశంసలు అందుకున్నా.. వసూళ్ల విషయంలో మాత్రం చాలా డల్ గా ఉంది. యాసిడ్ బాధితురాలిగా నటించిన ఆమె.. రియల్ లైఫ్ లో యాసిడ్ బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ జీవితాన్ని ఆధారంగా నటించిన సినిమాలో ఆమె నటించింది. చట్టాల ప్రకారం యాసిడ్ అమ్మకాలు నేరుగా సాగకూడదు. యాసిడ్ బాటిల్స్ అమ్మే షాపు యజమాని వాటిని కొనుగోలు చేసిన వ్యక్తికి సంబంధించిన గుర్తింపు కార్డుల్ని తీసుకున్న తర్వాతే అమ్మాల్సి ఉంటుంది.

కానీ.. ఈ చట్టం అస్సలు అమలు కావటం లేదన్న విషయాన్ని తన తాజా స్టింగ్ ఆపరేషన్ లో అందరికి అర్థమయ్యేలా చేసి సాకిచ్చింది. తాజాగా యాసిడ్ బాటిల్స్ అమ్మకాలు ఎలా సాగుతున్నాయన్న విషయాన్ని తన సిబ్బందితో స్టింగ్ ఆపరేషన్ చేయించింది. కారులో తాను కూర్చొని ఉండి.. వివిద వేషాల్లో తన సిబ్బందిని షాపులకు పంపి యాసిడ్ బాటిల్స్ కొనుగోలు చేసింది. ఇలా 24 గంటల వ్యవధిలో ఏకంగా 24 యాసిడ్ బాటిల్స్ ను తాము కొనుగోలు చేసినట్లు వెల్లడించింది.

అంతేకాదు.. తాము జరిపిన స్టింగ్ ఆపరేషన్ లో చాలామంది దుకాణ దారులు ఎలాంటి గుర్తింపు పత్రాలు తీసుకోకుండానే యాసిడ్ బాటిల్స్ ను అమ్మేస్తున్న దారుణ నిజాన్ని బయట పెట్టింది. చాలా తక్కువమంది మాత్రమే యాసిడ్ బాటిల్ అమ్మటానికి ముందు గుర్తింపు కార్డులు అడిగారన్నారు. సుప్రీంకోర్టు నిబంధనలు చేసినా.. అవేమీ అమలు కాకపోవటంపై దీపికా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. కొందరు మాత్రం ఇదంతా తన సినిమా ప్రమోషన్ కోసమే స్టింగ్ ఆపరేషన్ చేసినట్లు చెబుతున్నా.. ఆ ఆరోపణే నిజమే అనుకున్నా.. దాని వల్ల వ్యవస్థలోని లోపాన్ని అందరికి తెలిసేలా చేసిందన్నది మర్చిపోకూడదు.