Begin typing your search above and press return to search.

కిక్కిచ్చినందుకు ఆమెకు 17 కోట్లు

By:  Tupaki Desk   |   7 Feb 2018 12:17 PM GMT
కిక్కిచ్చినందుకు ఆమెకు 17 కోట్లు
X
టాలీవుడ్ లో కిక్ సినిమా ఎంతటి ఘన విజయాన్ని అందుకుందో అందరికి తెలిసిందే. రవితేజ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచినా ఆ సినిమా దర్శకుడిని కూడా టాప్ ప్లేస్ లో నిలబెట్టింది. అయితే అదే కథను బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కూడా హిందీలో రీమేక్ చేయగా మంచి హిట్ అయ్యింది. నార్త్ జనాల టెస్ట్ కి తగ్గట్టు దర్శకుడు సాజిద్ నదియావాలా అద్భుతంగా తెరకెక్కించాడు. మొదటి సినిమా తోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

అయితే రికార్డ్ కలెక్షన్స్ అందించిన ఆ సినిమాకు మరో సారి అదే టీమ్ సీక్వెల్ ను తెరకెక్కించాలని ప్లాన్ చేస్తోంది. గత కొంత కాలంగా ఈ వార్తలు సోషల్ మీడియాలో చాలా వస్తున్నప్పటికీ అధికారికంగా ఎవరు స్పందించలేదు. కానీ రీసెంట్ గా దర్శక నిర్మాత సాజిద్ క్లియర్ గా చెప్పేశాడు. త్వరలోనే సినిమాను పట్టాలెక్కించి భారీ స్థాయిలో సినిమాను నిర్మించడానికి సన్నాహకాలు చేస్తున్నాడు. అప్పుడు సల్మాన్ తో జాక్వలిన్ ఫెర్నాండేజ్ జత కట్టిన సంగతి తెలిసిందే.

ఇక ఇప్పుడు సల్మాన్ తో పద్మావత్ బ్యూటీ దీపిక పదుకొనె రొమాన్స్ చేయడానికి సిద్ధమైంది. రీసెంట్ గా దర్సకనిర్మాత సాజిద్ ఆమెను కలిసి కథను ఒప్పించడాని తెలుస్తోంది. అయితే దీపిక రూ.17 కోట్ల వరకు రెమ్యునరేషన్ ని డిమాండ్ చేస్తోందట. అయితే ఎంతైనా పరవాలేదు అని ఆమెని ఫిక్స్ చేసినట్లు టాక్. తనకు కిక్కిస్తే సల్మాన్ ఎంతైనా ఇస్తాడులే అనేది అందుకే మరి. ఈ ఇయర్ లోనే సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి రిలీజ్ చేయాలనీ దర్శకుడు ఆలోచిస్తున్నాడు. మరి సినిమా ఏ స్థాయిలో కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.