Begin typing your search above and press return to search.
నమ్మలేని రూపంలో అందాల దీపిక
By: Tupaki Desk | 25 March 2019 5:09 AM GMTబాలీవుడ్ లోనే కాదు ఇండియాలోనే మోస్ట్ డిజైరబుల్ విమెన్ అండ్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న దీపికా పదుకునే కెరీర్లోనే మొదటిసారి ఓ సాహసోపేతమైన పాత్ర చేస్తోంది. కొన్నేళ్ల క్రితం యాసిడ్ దాడికి గురై అందమైన రూపాన్ని కోల్పోయినా భయపడకుండా ఆత్మవిశ్వాసాన్ని ప్రోది చేసుకుని నిజ జీవితంలో విజేతగా నిలిచిన లక్ష్మి అగర్వాల్ కథను తీసుకుని దర్శకురాలు మేఘన గుల్జార్ రూపొందిస్తున్న పిచక్ ఫస్ట్ లుక్ ఇందాకా విడుదల చేశారు.
మొహమంతా గుర్తు పట్టలేని విధంగా యాసిడ్ భూతానికి బలైపోయిన మేకప్ లో దీపికా పదుకునే గుర్తుపట్టలేని విధంగా ఉంది. ప్రొస్థెటిక్స్ మేకప్ పద్ధతిని ఉపయోగించిన తీరు బాగానే ఉంది కానీ ఇంకొంచెం శ్రద్ధ వహించి ఉంటే మరింత సహజంగా ఉండేది. దీపికాకు చేసిన మేకప్ వెనుక అసలు మొహం తాలూకు షేడ్స్ కొన్ని స్పష్టంగా కనిపించడం కొంత లోపంగానే అనిపిస్తుంది. ఒక్క పోస్టర్ కే అంచనాకు రాలేం కాబట్టి దీపికా ధైర్యాన్ని మెచ్చుకోవలసిందే
2005లో లక్ష్మి అగర్వాల్ యాసిడ్ దాడికి గురయ్యింది. 15 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు తిరస్కరించింది అనే ఒకే ఒక్క కారణంగా 32 ఏళ్ళ నదీమ్ సయ్యద్ అనే వ్యక్తి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత లక్ష్మి ఇలాంటి దాడులకు వ్యతిరేకంగా పోరాడుతూ తనలాంటి బాధితులకు అండగా నిలిచే ప్రయత్నం చేసింది.
తనకు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పలు అవార్డులు కూడా వచ్చాయి. తర్వాత కాలంలో యాంకర్ గా మారి 2014లో అలోక్ దీక్షిత్ అనే వ్యక్తి లక్ష్మిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇదంతా పిచక్ లో కవర్ చేయబోతున్నారు. వచ్చే సంవత్సరం జనవరి 10న విడుదల కాబోతున్న ఈ మూవీ తన కెరీర్ లోనే బెస్ట్ మూవీగా నిలిస్తుందన్న అంచనాలో ఉంది దీపికా పదుకునే.