Begin typing your search above and press return to search.

సెట్ లో పద్మావతి ఏడ్చిందట

By:  Tupaki Desk   |   3 May 2017 7:33 AM GMT
సెట్ లో పద్మావతి ఏడ్చిందట
X
దీపికా పదుకొనె ఇప్పుడు పద్మావతి షూటింగ్ లో జరిగిన సంఘటనలుకు డిప్రెస్ అయినా.. మళ్ళీ ఇప్పుడు షూటింగ్ మొదలు కావడంతో అంతా సద్దుకుంది. ఆ మధ్య గర్ల్ పవర్ పైన డిప్రెషన్ పైన వీడియొలు చేసి చర్చలు పెట్టి చాలామందికి ఆదార్శంగా నిలిచిందీ సుందరాంగి. దాని వలన కొన్ని ఘాటు విమర్శలును కూడా చవిచూసింది.

దీపికా లివ్ లవ్ లాఫ్ అనే ఫౌండేషన్ కూడా స్టార్ట్ చేసింది. కేవలం డిప్రెషన్ లో ఉన్నవారికి సపోర్ట్ చేయడానికి ఈ సంస్థ సహాయం చేస్తుంది. ఈ అమ్మడు ‘రామ్‌-లీలా’ సినిమా సెట్‌ లో ఒకసారి కంటతడి పెట్టారట. ఈ విషయాన్ని మాటల రచయిత గరిమా వహాల్ ఒక ఇంటర్యూలో చెప్పారు. “దీపికా డైలాగ్స్‌ ని బాగా గుర్తు పెట్టుకుంటుంది. ఒకసారి సంజయ్‌ లీలా భన్సాలీ చివరి నిమిషం లో డైలాగ్స్‌ మార్చారు. అప్పటికప్పుడు ఎలా చెప్పాలో తెలియక రాత్రి అంతా కష్ట పడింది వృదా అయినందుకు ఆమె ఏడ్చేసింది. మళ్ళీ తనే తేరుకొని డైలాగ్స్‌ని తొందరగా వంటబట్టించుకుని చెప్పింది'' అంటూ గరిమా చెప్పింది. ఇలా డైలాగులు మార్చడం సంజయ్‌ లీలా భన్సాలీకి పరిపాటి అయినా .. దీపికకు అదే మొదటి రోజు షూటింగ్ కావడంతో ఆమె బాగా ఫీలైంది.

ఇక 'రామ్ లీలా' తీశాక దీపిక యాక్టింగ్ నచ్చి భన్సాలీ వెంటనే 'బాజీరావ్ మస్తానీ'లో కూడా ఆమెనే మెయిన్ లీడ్ గా పెట్టాడు. ఇప్పుడు ఈయన తీస్తున్న 'పద్మావతి' చిత్రం లో కూడా దీపికా పదుకొనె టైటిల్ పాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రణ్‌వీర్‌ సింగ్‌, షాహిద్‌ కపూర్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అది సంగతి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/