Begin typing your search above and press return to search.

ఫోటో టాక్‌: మూడో లుక్ తో మ‌టాష్

By:  Tupaki Desk   |   17 May 2019 12:21 PM GMT
ఫోటో టాక్‌: మూడో లుక్ తో మ‌టాష్
X
కేన్స్ 2019 ఉత్స‌వాల్లో బాలీవుడ్ అంద‌గ‌త్తెల‌ డామినేష‌న్ గురించి తెలిసిందే. మ‌న భామ‌ల అంద‌చందాలు.. ఫ్యాష‌న్ ఎలివేష‌న్ ముందు ప్ర‌పంచం చిన్న‌బోయింది. ఇత‌ర దేశాల నుంచి వ‌చ్చిన ఏ భామా ఈ బ్యూటీ క్వీన్స్ కి పోటీ కానే కాద‌ని అర్థ‌మైంది. ముఖ్యంగా ర‌క‌ర‌కాల డిజైన‌ర్ దుస్తుల్లో క‌థానాయిక‌ల ఫ్యాష‌న్ షో ప్ర‌త్యేకంగా హైలైట్ అయ్యింది. ఈ వేడుక‌ల్లో హీనా ఖాన్.. ప్రియాంక చోప్రా.. కంగ‌న ర‌నౌత్.. దీపిక ప‌దుకొనే వంటి నాయిక‌లు త‌మ‌వైన రెడ్ కార్పెట్ విన్యాసాల‌తో క‌ట్టి ప‌డేశారు.

ఇప్ప‌టికి దీపిక మూడు ర‌కాల డిజైన‌ర్ డ్రెస్సుల్లో త‌ళుకుబెళుకులు ప్ర‌ద‌ర్శించింది. నేటి ఉద‌యం ఓ రెండు డిఫ‌రెంట్ డిజైన‌ర్ లుక్స్ ని రివీల్ చేసిన దీపిక తాజాగా మ‌రో కొత్త లుక్ తో దుమారం రేపింది. ఈ డ్రెస్ పూర్తిగా డిఫ‌రెంట్. పూర్తిగా పాక్షికంగా అందాల్ని ఎలివేట్ చేసేంత ప‌లుచ‌ని వైట్ లైనింగ్ క్లాత్ తో ఈ డిజైన‌ర్ వేర్ ని దీపిక కోసం రూపొందించారు డిజైన‌ర్స్. తెల‌తెల్ల‌ని హంస‌ను త‌ల‌పిస్తున్న ఈ బ్యూటీ స్ట‌న్నింగ్ అనిపించే గాగుల్స్ తో బ‌రిలో దిగింది.

ఈ మూడో లుక్ కి స్ఫూర్తి ఎవ‌రో దీపిక‌నే చెప్పింది. లారెంజో సెరాఫిని ది ఫిలాస‌ఫీ పేరుతో ఈ ఔట్ ఫిట్ ని రూపొందించారు. ఇక ఆ వైట్ & వైట్ డ్రెస్ ని ర‌క‌ర‌కాల లేస్ ల‌తో చుట్టేస్తూ డిజైన్ చేసిన విధానం మైమ‌రిపిస్తోంది. ప‌వ‌ర్ పింక్ హైహీల్స్.. జిమ్మీ చూ.. అండ్ రౌండ్ స‌న్నీస్ ..తో మార్క్ జాక‌బ్స్ డిజైన్ ని బాట‌మ్ లో ధ‌రించింది. ఇక ఈ డిజైన్ కి త‌గ్గ‌ట్టే బెల్ట్ కాంబినేష‌న్... మేక‌ప్ కాంబినేష‌న్ ఫెయిల్యూర్ లేకుండా దీపిక ఎంతో జాగ్ర‌త్త ప‌డింది. మొత్తానికి కేన్స్ ని దీపిక గ‌జ‌గ‌జ ఒణికించింద‌నే చెప్పాలి.