Begin typing your search above and press return to search.
దీపికా పదుకొనే `హాలోవీన్ డ్రగ్స్ పార్టీ` ప్రకంపనాలు!
By: Tupaki Desk | 23 Sep 2020 4:45 AM GMTమాదకద్రవ్యాల కోణంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సిబి) దర్యాప్తులో బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మార్మిక మరణం కేసు కొత్త మలుపు తిరిగింది. సారా అలీ ఖాన్ - శ్రద్ధా కపూర్ పేరు తరువాత నటి దీపికా పదుకొనే పేరు ఎన్.సిబి దృష్టికి చేరడంతో ఆ మేరకు జాతీయ మీడియా కథనాలు సంచలనాలుగా మారాయి.
దీపికా పదుకొనే ఆమె మేనేజర్ కరిష్మా మధ్య అక్టోబర్ 2017 నాటి వాట్సాప్ చాట్స్ ఆర్డీఎక్స్ బాంబ్ లా పేలనున్నాయన్న చర్చ సాగుతోంది. బాలీవుడ్ లో డ్రగ్ ఎక్స్ఛేంజ్ సజావుగా నడుస్తున్నట్లు ఈ చాట్లు వెల్లడించాయని జాతీయ మీడియా పేర్కొంది. 28 అక్టోబర్ 2017న జరిగిన కోకో అనే అల్ట్రా మోడ్రన్ ముంబై క్లబ్ లో హాలోవీన్ పార్టీ జరిగింది.
ఎన్.సి.బికి దొరికిన అప్పటి చాటింగ్ లో దీపిక `మాల్` ను అడగడం క్వాన్ టాలెంట్ మేనేజ్మెంట్ కంపెనీకి చెందిన కరిష్మా ప్రకాష్ నుండి హాష్ & కలుపును ఇచ్చినట్టుగా చాట్ బయటపడిందని తెలుస్తోంది. యాదృచ్ఛికంగా అదే రోజు చాటింగ్ చేస్తున్నప్పుడు కరీష్మా ప్రకాష్ కోకోకు ఎప్పుడు చేరుకుంటారు? అంటూ దీపికను అడిగారు.
కోకో ముంబైలోని పార్టీల హాట్ స్పాట్ .. అనేక మంది ఎ-లిస్టర్లు కలిసి ఈ ప్రదేశాన్ని సందర్శిస్తారు. ఈ చాట్లు 28 అక్టోబర్ 2017 నాటివి. అదే రాత్రి కోకోలో ఒక పార్టీ జరిగింది. దీనికి దీపిక- సిధార్థ్ మల్హోత్రా- సోనాక్షి సిన్హా- ఆదిత్య రాయ్ కపూర్ తదితరులు హాజరయ్యారు.
వాస్తవానికి కోకో క్లబ్ పార్టీ ఫోటోలను రెండు రోజుల తరువాత వారి ఫేస్ బుక్ హ్యాండిల్ లో పోస్ట్ చేసింది. ఇక్కడ తలెత్తే పెద్ద ప్రశ్న ఏమిటంటే.. ఈ పార్టీ కోసం కరిష్మా ప్రకాష్ ను దీపిక డ్రగ్స్ అడిగారు? ఆ రాత్రి కోకోలో జరిగిన హాలోవీన్ థీమ్ పార్టీలో అసలు ఏమి జరిగింది? అన్నదానిపైనా ఎన్.సి.బి ఆరాలు తీస్తోందని జాతీయ మీడియా వెల్లడించింది.
దీనిపై ఓ ప్రముఖ టీవీ చానెల్ సోనాక్షి సిన్హా.. సిద్దార్థ్ మల్హోత్రా.. ఆదిత్య రాయ్ కపూర్లను సంప్రదించడానికి ప్రయత్నించినప్పటికీ ఇప్పటివరకు ఎవరూ మెసేజ్ కి సమాధానం ఇవ్వలేదని కథనాలొచ్చాయి. త్వరలోనే దీపికాను ఎన్సిబి విచారణ కోసం పిలుస్తుందని భావిస్తున్నారు. ఈ నటి ప్రస్తుతం ఒక ప్రాజెక్ట్ కోసం గోవా షూటింగ్ లో ఉంది. మరోవైపు నిన్నటిరోజున చెన్నయ్ లో ఓ షాప్ ఓపెనింగుకి హాజరై షాకిచ్చింది దీపిక.