Begin typing your search above and press return to search.

బేఫికర్ దెబ్బతో బ్రేకప్ అయ్యేలా ఉందే

By:  Tupaki Desk   |   18 Oct 2016 10:30 PM GMT
బేఫికర్ దెబ్బతో బ్రేకప్ అయ్యేలా ఉందే
X
కొన్ని సినిమాల్లో నటించడం కారణంగా ఆ ప్రభావం ఖచ్చితంగా రియల్ లైఫ్‌ పై ఉంటుంది. అప్పట్లో అమితాబ్ బచ్చన్ అండ్ జయబాధురి మధ్యన మనస్పర్ధలు వచ్చాయంటే.. కేవలం మనోడు రేఖ తో కలసి ఒక సినిమాను చేయడమే. సేమ ఇప్పుడు అలాంటి ప్రాబ్లమే బాలీవుడ్ బెస్ట్ లవర్స్ గా పేరొందిన దీపికా పదుకొనె అండ్ రణవీర్ సింగ్ కూడా ఫేస్ చేస్తున్నారా అంటే.. అవుననే అంటున్నారు బాలీవుడ్ వారు.

నిజానికి దీపిక హాలీవుడ్ వెళ్తోంది అనగానే.. వెంటనే ఆ విషయాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకుని తెగ ఆనందపడ్డాడు రణవీర్ సింగ్. అలాగే ట్రిపుల్ ఎక్స్ సినిమా టీజర్ నుండి ట్రైలర్ వరకు.. పోస్టర్ నుండి ఆన్ లొకేషన్ ఫోటోస్ వరకు.. ఏదొచ్చినా కూడా రీ ట్వీట్లు చేస్తూ.. ప్రియురాలిని ఫుల్ ఖుషీ చేశారు. దీపిక ఒక ప్రక్కన హీరో విన్ డీజిల్ తో చాలా హాటుగా నటించినా కూడా.. రణవీర్ మాత్రం పెద్దగా ఈగో ఫీలవ్వలేదు. అయితే ఇప్పుడు సడన్ గా ''బేఫికర్‌'' సినిమాలో మనోడు ముద్దులతో మోత మోగించాడు. వాణి కపూర్ తో కలసి ప్రేమాయణం తాలూకు సినిమా అంటూనే అదేదో డబుల్ ఎక్స్ మూవీ అన్న తరహాలో చేశాడు. అయితే ఇదంతా దర్శకుడు ఆదిత్య చోప్రా సూచనల మేరకే చేసినా కూడా.. ఎందుకోగాని దీపికకు నచ్చలేదు. అందుకే ఈ సినిమా గురించి ఆమె కనీసం ఒక్క ముక్క ట్వీట్ చేయకపోగా.. కనీసం ఇంటర్యూల్లో అడిగినా కూడా చెప్పను అంటోంది.

ఇదే విషయం ఇప్పుడు రణవీర్ సింగ్ ను బాగా బాధించిందని.. అందుకే ఇద్దరూ ఈగో క్లాషెస్ తో కొట్టుకుంటున్నారని అంటున్నారు బాలీవుడ్ జనాలు. పైగా హాలీవుడ్ సినిమా హిట్టయితే కనుక.. వెంటనే హాలీవుడ్ సైడ్ మూవ్ అవుదాం అనే ఆలోచనలతో ఉన్న దీపిక.. ఎందుకో రణవీర్ విషయంలో కాస్త వెనకడుగు వేసేద్దాం అని కూడా అనుకుంటోందని ఆ మధ్యన వార్తలొచ్చాయి. చూస్తుంటే ''బేఫికర్'' సినిమా వీరి మధ్యన చిచ్చు కాస్త గాట్టిగా పెట్టినట్లే ఉంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/