Begin typing your search above and press return to search.

సారీలో దీపిక హొయ‌లు..తొలి రోజు మెరుపులు!

By:  Tupaki Desk   |   18 May 2022 5:48 AM GMT
సారీలో దీపిక హొయ‌లు..తొలి రోజు మెరుపులు!
X
అంత‌ర్జాతీయ కేన్స్ ఫిలిం ఫెస్టివ‌ల్స్ లోభార‌తీయ న‌టీమ‌ణులు త‌ళుక్కున మెరుస్తున్న సంగ‌తి తెలిసిందే. డిజైన‌ర్ దుస్తుల్లో..అందం..అభిన‌యం..ఆహార్యంతో ఉత్స‌వాల‌కు మ‌రింత క‌ళ ఏర్ప‌డింది. ఇండియ‌న్ భామ‌ల ఎంట్రీతో కేన్స్ ఉత్స‌వాల‌కే స‌రికొత్త వ‌న్నె తోడైంది. ప్ర‌తీ చాలా ప‌రిమితంగానే ఆహ్వానం అందేది. కానీ ఈసారి బాలీవుడ్ తో పాటు..సౌత్ న‌టీమ‌ణులు ఎక్కువ‌గా హాజ‌ర‌వ్వ‌డంతో మ‌రింత క‌న్నుల విందుగా ఉంది.

తాజాగా కేన్స్ ప్రారంభోత్స‌వం రోజున బాలీవుడ్ న‌టి దీపికా ప‌దుకొనే రెడ్ కార్పెట్ పై త‌ళుక్కున మెరిసింది. ప్రఖ్యాత ఫ్యాషన్ డిజైనర్ సబ్యసాచి ముఖర్జీ డిజైన్ చేసిన‌ బెంగాల్ టైగర్ చీరలో రెడ్ కార్పెట్ మీద నడుస్తూ అబ్బురపరిచింది. నల్లటి స్ట్రాప్‌లెస్ బ్లౌజ్‌తో జత చేసిన చీర.. దాని బంగారు మరియు నలుపు చారల కారణంగా ప్రత్యేక ఆక‌ర్ష‌ణీయంగా నిలిచింది. అంతకుముందు దీపిక‌ జ్యూరీ ప్రోటోకాల్ కోసం లైమ్ గ్రీన్ ప్యాంటు జాంటీ షర్ట్‌తో కూడిన డిజైన‌ర్ దుస్తుల్లో మెరిసిన సంగ‌తి తెలిసిందే.

ఈ వాస్తవాన్ని ప్రపంచానికి తెలియజేసేందుకు ఫేమ‌స్ డిజైనర్ ఇన్‌స్టాగ్రామ్ లో ఆస‌క్తిక‌ర పోస్ట్ పెట్టారు. 'ఆధునిక లెన్స్ ద్వారా కనిపించే వారసత్వ భారతీయ చేతి పనులు మరియు సాంకేతికతలను జరుపుకునే తన ఆకాష్ తారా సేకరణలో చీర ఒక భాగమన్నారు. బ్లాక్‌లు సబ్యసాచి అటెలియర్‌లో భారతదేశంలోని అత్యుత్తమ కళాకారులచే బ్లాక్ ప్రింటెడ్ మరియు హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేయబడ్డాయి" అని డిజైనర్ తెలిపారు.

సబ్యసాచి జ్యువెలరీ యొక్క రాయల్ బెంగాల్ కలెక్షన్ నుండి బెజ్వెల్డ్ హెడ్‌బ్యాండ్‌తో దీపిక చీరను జత చేసారు. 'హెడ్‌బ్యాండ్' డిజైనర్ వివరించారు. ''సాంప్రదాయ భారతీయ 'మఠం పట్టి' హెడ్‌పీస్‌లో అద్భుతంగా ఉంది. షాన్డిలియర్ చెవిపోగులు ఆర్ట్ నోవౌ చూపులతో దీపిక‌ని మ‌రింత క్లాసిక్ బ్యూటీగా హైలైట్ చేస్తున్నాయి.

బోల్డ్ మరియు బ్లాక్ ఐలైనర్. బ్లాక్ మ్యానిక్యూర్.. న్యూడ్ లిప్స్ .. హెయిర్ బన్‌తో రెట్రో లుక్ దీపిక ఎంతో మ‌నోహ‌రంగా క‌నిపిస్తుంది. ఈ సందర్భంగా చీర గొప్ప‌ద‌నం మ‌రోసారి ప్ర‌పంచ వేదిక‌పై హైలైట్ గా నిలిచింది. చీర అందం గురించి చెప్ప‌డానికి మాట‌ల్లేవ్. ఆ అందాన్ని మాట‌ల్లో వ‌ర్ణించ‌లేం. ప్ర‌పంచంలో ఎన్ని డిజైన్లు ఉన్నా చీర ఎప్ప‌టికీ ప్ర‌త్యేక‌మై. చీర‌లో క‌నిపించిన అందం మరే దుస్తుల్లోనూ క‌నిపించ‌ద‌ని ఫ్యాష‌న్ డిజైనర్లు అభిప్రాయ‌ప‌డ్డారు.

దీపికా ప‌దుకొణే కెరీర్ విష‌యానికి టాలీవుడ్ లో 'ప్రాజెక్ట్ -కె' తో లాంచ్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇందులో ప్ర‌భాస్ స‌ర‌స‌న జంట‌గా న‌టిస్తోంది. దీపిక ప్ర‌వేశంతో ప్రాజెక్ట్ -కె కి శోభ సంత‌రించుకుంది. ప్ర‌భాస్ క‌టౌట్ కి త‌గ్గ అస‌లైన హీరోయిన్ అంటూ కితాబు అందుకుంటుంది. బాలీవుడ్ లో యదావిధిగా సినిమాలు చేస్తూ బీజీగానే ఉంది. ఇటీవలే 'గెహ్రైయాన్' సినిమాతో మ‌రో స‌క్సెస్ ఖాతాలో వేసుకున్న సంగ‌తి తెలిసిందే.