Begin typing your search above and press return to search.

స‌తి లెవ‌ల్ చూసి స‌ఖుడి మురిపెం

By:  Tupaki Desk   |   24 Jan 2020 6:21 AM GMT
స‌తి లెవ‌ల్ చూసి స‌ఖుడి మురిపెం
X
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక ప‌దుకొనే- ర‌ణ‌వీర్ సింగ్ జంట ఆదర్శ దాంప‌త్యం గురించి తెలిసిందే. త‌న స‌తీమ‌ణిని అన్ని రంగాల్లోనూ ప్రోత్స‌హిస్తూ ర‌ణ‌వీర్ మంచి భ‌ర్త అనిపించుకుంటున్నాడు. ఓవైపు దీపిక వ‌రుస‌గా సినిమాల్లో న‌టిస్తూనే నిర్మాత‌గానూ స‌త్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతోంది. తాను న‌టించే సినిమాల‌కు.. అలాగే భ‌ర్త న‌టిస్తున్న సినిమాల‌కు భారీగా పెట్టుబ‌డులు స‌మ‌కూరుస్తోంది. ఇత‌ర నిర్మాత‌ల‌తో క‌లిసి నిర్మాణ భాగ‌స్వామిగా సినిమాలు తెర‌కెక్కిస్తోంది. ఇటీవ‌లే రిలీజైన చ‌పాక్.. త్వ‌ర‌లో రిలీజ్ కి వ‌స్తున్న 83 చిత్రాల‌కు దీపిక పెట్టుబ‌డులు పెట్టిన సంగ‌తి తెలిసిందే.

ఇక ఫ్యాష‌న్ అండ్ ట్రెండ్స్ ప‌రంగానూ దీపిక‌ కు నేటి త‌రంలో ఉన్న ఇమేజ్ అంతా ఇంతా కాదు. డిప్స్ తాను ఏ ఫ్యాష‌న్ ని ఫాలో చేసినా దానిని అనుక‌రించేందుకు యువ‌తులు అమితంగా ఇష్ట‌ప‌డ‌తారు. భార్యామ‌ణి అయ్యాకా దీపిక క్రేజు యూత్ లో కించిత్ కూడా త‌గ్గ‌లేదు. ఇక గ్లోబల్ ఐకాన్ గా త‌న‌కు ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న ఫాలోయింగ్ ఎన్నో గొప్ప అవ‌కాశాల్ని తెచ్చి పెడుతోంది. ఫ్యాష‌న్ అండ్ ట్రెండ్స్ ని అనుక‌రించ‌డంలోనూ భార‌తీయ‌త‌ను ఆపాదించి డిఫ‌రెంట్ లెవ‌ల్ కి తీసుకువెళుతూ చ‌క్క‌ని గుర్తింపును ద‌క్కించుకుంటోంది. ప్ర‌ఖ్యాత లూయీస్ వీట్ట‌న్ బ్రాండ్ కి దీపిక ప్ర‌చారం చేస్తోందంటే అర్థం చేసుకోవాలి.

తాజాగా ఈ బ్రాండ్ కి సంబంధించిన ఫోటోషూట్ ఒక‌టి రివీలైంది. ఐకానిక్ బ్రాండ్ లూయిస్ విట్టన్ ప్రీ-ఫాల్ 2020 ప్రచారం కోసం దీపిక ఫోటోషూట్ లో పాల్గొంది. ఈ క్రేజీ బ్రాండ్ ప్రక‌ట‌న‌ లో నటించిన మొట్ట మొదటి బాలీవుడ్ నటిగా దీపిక‌ చరిత్ర సృష్టించింది. ప్రపంచంలోని అత్యంత ప్రాచుర్యం పొందిన ఈ బ్రాండ్ కోసం నికోలస్ గెస్క్వియర్ త‌న‌ని ఎంపిక చేసుకోవ‌డం పై దీపిక ఆనందం వ్య‌క్తం చేసింది. ఫ్రెంచ్ ఫ్యాషన్ డిజైనర్ నికోలస్ 2013 నుండి లూయిస్ విట్టన్ కి సంబంధించి క్రియేటివ్ దర్శకుడిగా కొన‌సాగుతున్నారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఎంద‌రో స్టార్ల‌తో ఫోటో షూట్లను డైరెక్ట్ చేశారాయ‌న‌. ఈసారి ఆయ‌న‌ ఛాయిస్ దీపిక కావ‌డం ఆస‌క్తి ని రేకెత్తిస్తోంది.

తాజా ఫోటోషూట్ లో వైట్ అండ్ బ్లాక్ కాంబినేష‌న్ డిజైన‌ర్ లాంగ్ కోట్ లో దీపిక లుక్ అదిరిపోయింది. లూయీస్ వీట‌న్ బ్రాండ్ మినీ బెల్ట్ బ్యాగ్ - గ్రీన్ క్విల్టెడ్ బూట్లతో దీపిక అద‌ర‌ గొట్టింద‌నే చెప్పాలి. ఈ డిజైన్ రూప‌క‌ల్ప‌న‌కు పల్ప్ హర్రర్ సినిమాలు .. హార‌ర్ పుస్తకాలు స్ఫూర్తి అని తెలుస్తోంది. దీపిక ఎల్వీ లుక్ చూడ‌గానే.. హబ్బీ రణ్‌వీర్ సింగ్ ఫైర్ క్రాకర్ ఎమోటికాన్ లతో `నెక్స్ట్ లెవెల్` అంటూ ఇన్ స్టాలో రాశాడు. 24 మంది పోస్టర్ గాళ్స్ ఈ షూట్ లో పాల్గొన‌గా.. దీపిక‌- సోఫీ టర్నర్- లియా సెడాక్స్- అలిసియా వికాండర్ - క్లోస్ గ్రేస్ మోరెట్జ్ లాంటి స్టార్ల‌తోనూ నికోల‌స్ ఫోటోషూట్లు చేశార‌ట‌.