Begin typing your search above and press return to search.

పద్మావతి లుక్ అదరహో!!

By:  Tupaki Desk   |   21 Sept 2017 12:59 PM IST
పద్మావతి లుక్ అదరహో!!
X
బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే నటిస్తున్న లేటెస్ట్ మూవీ పద్మావతి. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ముందు నుంచి మంచి అంచనాలే ఉన్నాయి. దీపిక రియల్ లైఫ్ లవర్ రణవీర్ సింగ్ ఈ చిత్రంలో నెగిటివ్ రోల్ పోషిస్తుండడం.. చారిత్రాత్మక కథ ఆధారంగా రూపొందుతున్న మూవీ కావడంతో.. ఆడియన్స్ లో కూడా ఆసక్తి నెలకొంది.

తాజాగా ఈ చిత్రానికి టైటిల్ లోగో లుక్ రిలీజ్ చేయగా.. జనాలను ఈ లుక్ బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు పద్మావతి ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేసింది యూనిట్. పద్మావతి పాత్రలో దీపిక ఎంతగా ఒదిగిపోయిందనే విషయాన్ని ఈ ఫస్ట్ లుక్ చెబుతుంది. శరీరంలో అణువణువునా ఆభరణాలు ఉన్న దీపికా పదుకొనే.. నమస్కరిస్తూ ఉన్నట్లుగా పోజ్ ను ఫస్ట్ లుక్ గా రిలీజ్ చేశారు. భారీ పట్టు చీర.. అంతకంటే భారీ ఆభరణాలు.. ప్రత్యేకించి అత్యంత పెద్దదిగా దాదాపు సగం ముఖాన్ని కవర్ చేసేస్తున్న ముక్కు పుడక ఈ ఫస్ట్ లుక్ కు ఆకర్షణగా చెప్పచ్చు. అయితే.. ఈ పోస్టర్ లో పద్మావతి పాత్ర కళ్లలోనే కనిపిస్తున్న భావాలే అన్నిటికంటే పెద్ద హైలైట్ గా చెప్పాలి.

దీపిక భర్తగా షాహిద్ కపూర్.. అల్లావుద్దీన్ ఖిల్జీ పాత్రలో రణవీర్ ఈ చిత్రంలో నటిస్తుండగా.. డిసెంబర్ 1న పద్మావతి మూవీని రిలీజ్ చేయబోతున్నట్లు ఫస్ట్ లుక్ పోస్టర్ ద్వారా అఫీషియల్ గా ప్రకటించాడు దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ.