Begin typing your search above and press return to search.
హాలీవుడ్ హీరోకి లుంగీ కట్టించారు
By: Tupaki Desk | 13 Jan 2017 8:57 AM GMTహాలీవుడ్ హీరో అయితేనేం.. మన దగ్గరకు వచ్చాక మనలానే ఉండాలి. లేకపోతే నేటివిటీ మిస్ అవుతుంది. మిగిలిన చోట్ల సంగతి ఎలా ఉన్నా.. కోట్లాది రూపాయిలు కుమ్మరించే అవకాశం ఉన్నప్పుడు.. తమకు అలవాటు లేనివి కూడా ఈజీగా చేసేస్తారంతే. తాజాగా అలాంటి పనే చేసి అందరి దృష్టిని ఆకర్షించటమే కాదు.. వైరల్ గా మారి.. సినిమా ప్రమోషన్ కు భారీగా కలిసొచ్చేలా జరిగింది ట్రిపుల్ ఎక్స్ ప్రీమియర్ షో.
ఈ హాలీవుడ్ సినిమాలో విన్ డీజిల్ తో పాటు బాలీవుడ్ ముద్దుగుమ్మ దీపికా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రీమియర్ షోను తాజాగా ముంబయిలో నిర్వహించారు. దీనికి హాజరైన విన్ డీజిల్.. వేదిక మీద చెన్నై ఎక్స్ ప్రెస్ చిత్రంలోని లుంగీ డ్యాన్స్ పాటకు కాలు కదిపారు. ఈ క్రమంలో.. లుంగీ కట్టేసిన ఆయన.. అందరి మదిని దోచుకునే పని చేశారు. హాలీవుడ్ హీరో అయితేనేం మన దగ్గరికి వచ్చినప్పుడు మన లుంగీ కట్టాల్సిందే. స్టెప్పులు వేయాల్సిందే అన్నట్లుగా అనిపిస్తుంది లుంగీ సీన్ చూసినప్పుడు.
ఈ కార్యక్రమంలో దీపికా సైతం లుంగీ కట్టేసి.. పెన్సిల్ హీల్ వేసుకున్నా.. వెనుకాడకుండా జాగ్రత్తగా వేసిన స్టెప్పులు ఒక ఎత్తుఅయితే.. ఆమె వేసుకున్న బంగారు వర్ణం లాంగ్ ఫ్రాక్ లో క్లీవేజీని పూర్తిగా చూపించేసిన వైనం అక్కడి ప్రేక్షకులకే కాదు.. కెమేరాలకు భారీ పని పెట్టేసిందని చెప్పక తప్పదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/