Begin typing your search above and press return to search.
డ్రగ్స్ కేసు : NCB ముందు హాజరు కాని దీపిక మేనేజర్
By: Tupaki Desk | 22 Sep 2020 3:00 PM GMTడ్రగ్స్ కేసుతో సంబంధం ఉన్నట్లుగా అనుమానిస్తూ నిన్న బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకునే మేనేజర్ కరిశ్మ ప్రకాష్ కు NCB సమన్లు జారీ చేసినట్లుగా జాతీయ మీడియాలో వార్తలు వచ్చిన విషయం తెల్సిందే. NCB ఆదేశాల మేరకు నేడు కరిశ్మ విచారణకు హాజరు కావాల్సి ఉంది. కాని ఆమె హీరోయిన్ దీపికతో గోవాలో ఉన్న కారణంగా విచారణకు హాజరు కాలేదు అంటూ జాతీయ మీడియా సంస్థల్లో వార్తలు వస్తున్నాయి. ఆమెకు మరో అవకాశం ను ఎన్ సీ బీ వారు ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఆమె విచారణకు హాజరు కాకుంటే తదుపరి చర్యలకు కూడా NCB రెడీ అయ్యే అవకాశం ఉందంటున్నారు.
కరణ్ జోహార్ నిర్మాణంలో రూపొందుతున్న ఒక సినిమా షూటింగ్ కోసం దీపిక పదుకునే గోవాలో ఉంది. అక్కడకు కరిశ్మ కూడా వెళ్లిందట. డ్రగ్స్ కేసు సమన్లు ఆమెకు అందాయా లేదా అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. సమన్లు అందలేదు అంటూ విచారణకు హాజరు కాకపోయి ఉండవచ్చు అని కూడా మీడియా వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఈ రోజు కాకుంటే రేపు లేదా ఆ తర్వాత ఏదో ఒక రోజు అయినా కరిశ్మ విచారణకు హాజరు అవ్వాల్సిందే. ఆ సమయంలో ఎలాంటి విషయాలు బయటకు వస్తాయా అంటూ జాతీయ మీడియా వర్గాలు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. కరిశ్మతో పాటు దీపికకు కూడా NCB సమన్లు ఇచ్చే అవకాశం ఉందని టైమ్స్ నౌ తన కథనంలో పేర్కొంది.