Begin typing your search above and press return to search.

స్పైడర్.. ఒక పాఠం

By:  Tupaki Desk   |   4 Nov 2017 9:06 AM GMT
స్పైడర్.. ఒక పాఠం
X
సాదారణంగా చాలా వరకు హీరోయిన్స్ స్టార్ హీరోస్ తో నటించడానికి ఒక్క అవకాశం దొరికితే చాలు అనుకుంటారు. ఒక్కో సారి కథ ఎలా ఉన్నా కూడా ఆలోచించకుండా చేసేస్తారు. పెద్ద దర్శకుడు స్టార్ హీరో అనే నమ్మకంతో సినిమాలను ఆక్సెప్ట్ చేసే హీరోయిన్స్ అన్ని ఇండస్ట్రీలలో ఉన్నారు. అయితే ఒక్కోసారి ఆ సినిమాలు అంతగా సక్సెస్ అవ్వకపోవచ్చు.

కానీ తాను మాత్రం కథను నమ్మే సినిమాలను ఒకే చేస్తాను అంటోంది రకుల్ ప్రీత్ సింగ్. అయితే అమ్మడు తన కెరీర్ లోనే మొట్ట మొదటి సారి భారీ బడ్జెట్ తో తెరకెక్కిన స్పైడర్ సినిమాలో నటించింది. ఈ సినిమా కోసం రకుల్ చాలా కష్టపడిందని ఏకంగా మహేష్ బాబే పొగిడేశారు. సినిమా లేట్ అయినా కూడా డేట్స్ ని కూడా ఎక్కువాగానే ఇచ్చిందని చిత్ర యూనిట్ మొత్తం చెప్పింది. కానీ సినిమా మాత్రం ఉహించని విధంగా డిజాస్టర్ అయ్యింది. ఈ సినిమా రిలీజ్ తర్వాత రిజల్ట్ పై చిత్ర యూనిట్ కూడా ఎక్కడా ప్రస్తావించలేదు.

కానీ రకుల్ మాత్రం రీసెంట్ గా స్పందించింది. ఖాకి సినిమా ప్రమోషన్ లో భాగంగా రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో రకుల్ స్పైడర్ గురించి ప్రస్తావిస్తూ.. మనం కొన్ని సార్లు ఎంత కష్టపడినా సరైన రిజల్ట్ రాకపోవచ్చు. బట్ అది ఒక పాఠం లాంటిది. సినీ ఫీల్డ్ లో ఇలాంటివి తప్పవు. కానీ నేను చేసే ప్రతి సినిమాకి వంద శాతం పర్ఫెక్ట్ వర్క్ చేయడానికి ప్రయత్నిస్తాను అని రకుల్ వివరించింది.