Begin typing your search above and press return to search.

బాలీవుడ్ లో నా ఫస్ట్ ఫ్రెండ్ తనే

By:  Tupaki Desk   |   21 Nov 2015 1:51 PM GMT
బాలీవుడ్ లో నా ఫస్ట్ ఫ్రెండ్ తనే
X
బాజీరావ్ మస్తానీలో ప్రియంక - దీపికలు కలిసి చిందేశారు. ఈ మూవీలో చాలానే ప్రత్యేకతలు ఉన్నా... ఈ పాట స్పెషల్ అట్రాక్షన్. సాంగ్ టీజర్ లోనే వీరిద్దరి మధ్య ఎంత స్నేహం ఉందో అర్ధమైపోతుంది. ఇంతకీ బాలీవుడ్ బ్యూటీస్ ప్రియాకం చోప్రా - దీపికా పదుకునేల బంధం ఇప్పటిది కాదు. దీపిక పరిశ్రమలో అడుగుపెట్టినప్పటినుంచి వీరి రిలేషన్ కొనసాగుతోంది.

"నేను బాలీవుడ్ లో అడుగు పెట్టాక కలిసిన మొదటి సినిమా వ్యక్తి ప్రియాంకా చోప్రా. అప్పటికి ఆమె పెద్ద స్టార్. నేను అపుడే ఎంట్రీ ఇచ్చానంతే. నేను స్నేహం చేసిన తొలి వ్యక్తి ఆమే. పింగా సాంగ్ కలిసి చేసేందుకు మేం చాలా సౌకర్యంగా ఫీల్ అయ్యాం. చాలా మంది మా మధ్య ఏదో వైరం ఉందని అనుకుంటారు. ఈ పాట విషయంలో చాలా మందికి అనుమానాలున్నాయి. తాను ఏం ధరిస్తుంది.. నేను ఏం ధరిస్తాననే అంచనాలు కూడా చాలా ఉన్నాయి. మా మధ్య పోటీపై బోలెడు టాక్ నడిచింది. కానీ అక్కడ జరిగింది వేరే విషయం. సంజయ్ లీలా భన్సాలీ అయితే.. మీరు ఓసారి కొట్టుకోవచ్చు కదా అని చాలా సార్లు అడిగారు” అంటోంది దీపిక.

ఇంతకీ సెట్స్ పై వీళ్లు ఎలా ఉంటారో తెలుసా.. దేవుడిచ్చిన అక్కా చెల్లెళ్లలా అంటే నమ్మగలరా. కానీ బాజీరావ్ మస్తానీ సెట్స్ పై ఉన్నవాళ్లకి అర్ధమైంది ఆవిషయం. ఇప్పటివరకూ గడిచిన కాలాన్ని మేం గుర్తు చేసుకుంటూనే ఉంటామంటోంది దీపిక. ఏదైనా కష్టం అనిపించినపుడు ఒకరికి ఒకరు మద్దతుగా నిలిచిన సందర్భాలు బోలెడు ఉన్నాయంటోంది. తమ ఇద్దరిలో ఒకే స్థాయిలో ఎనర్జీ లెవెల్స్ ఉంటాయంటోందీ ఈ బాలీవుడ్ కిస్సింగ్ బ్యూటీ దీపికా పదుకొనే.