Begin typing your search above and press return to search.
కేన్స్ డిన్నర్ పార్టీలో దీపిక బ్రాండ్ ధగధగలు!
By: Tupaki Desk | 21 May 2022 10:42 AM GMT75వ కేన్స్ ఉత్సవాల్లో బాలీవుడ్ నటి దీపికా పదుకొణే మెరుపులు కొనసాగుతున్నాయి. గత నాలుగు రోజులుగా జరుగుతోన్న ఉత్సవాల్లో దీపిక రెడ్ కార్పెట్ పై వెలుగు జిలుగులతో కేన్స్ ప్రియుల్ని ఆకట్టుకుంటుంది. తాజాగా దీపిక హోటెల్ మార్టినెజ్లో ప్రత్యేక డిన్నర్ లో పాల్గొంది. కేన్స్ అధికారిక విందుకు హాజరైన సమయంలోనూ హై-ఫ్యాషన్ రూపాన్ని తీసుకువచ్చింది.
దీపిక లూయిస్ విట్టన్ బ్రాండెడ్ దుస్తుల్లో డిన్నర్‌కు హాజరైంది. డిన్నర్ లుక్ కోసం నటి ఎడ్జీ జాకెట్ లెదర్ దుస్తుల్లో తళుక్కున మెరిసింది. దీపిక మోకాలి వరకు ఉన్న లెదర్ బూట్లు మరియు స్లింగ్ బ్యాగ్ తో మరింత స్టైలిష్ గా కనిపిస్తుంది. హైట్ కి తగ్గ డిజైనర్ కాస్ట్యూమ్స్..షూస్ తో లుక్ ని పర్పెక్ట్ గా బ్యాలెన్స్ చేసింది.
దీపిక హెయిర్ స్టైల్.. ప్రత్యేక అలంకరణలో డిన్నర్ పార్టీలో సెంట్రా ఆఫ్ ది అట్రాక్షన్ గా నిలిచింది. ఇంకా ఈ డిన్నర్ లో రెబెక్కా హాల్.. విన్సెంట్ లండన్.. జాస్మిన్ ట్రిన్కా.. అస్గర్ ఫర్హాది.. జెఫ్ నికోల్స్ లు పొల్గొన్నారు. ఇటీవలే దీపికా పదుకొణే లూయిస్ విట్టన్ బ్రాండ్ ప్రమోటర్ గా ఎంపికైన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం దీపిక ఈ ఫోటో ఫ్యాషన్ ప్రియుల్ని ఆకట్టుకుంటుంది. దీపిక ఎదుగుదలని చూసి అభిమానులు సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు. అలాగే అమ్మడు కేన్స్ ఉత్సవాల్లో తళుకులీనడం వెనుక ఎంతో కృషి ఉందని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంది.
కేన్స్ ఉత్సవాలకు హాజరవ్వడం దగ్గర నుంచి ప్రత్యేకంగా జ్యూరీ సభ్యురాలిగా ఎంపిక అవ్వడం వెనుక కొన్ని సంవత్సరాల కృషి...కొంత మంది శ్రమ దాగి ఉందని తెలిపింది.
ఇంకా మాట్లాడుతూ..``కేన్స్ లో ఇలాంటి గౌరవం ఎప్పుడో దక్కాలి. కానీ మమ్మల్ని ఈ ప్రదేశానికి తీసుకురావడానికి వివిధ వ్యక్తుల ఎంతో కృషి చేసారు. కొన్ని సంవత్సరాల పాటు శ్రమిస్తేనే ఈ రోజు ఇలా నిలబడగలిగాం` అని అంది.
దీపిక పదుకొణే సినిమాల విషయానికి వస్తే ముగ్గురు సూపర్ స్టార్లతో సినిమాలు చేస్తుంది. షారుక్ సరసన `పఠాన్` లో... హృతిక్ రోషన్ తో `ఫైటర్` లో నటిస్తుంది. అలాగే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన `ప్రాజెక్ట్ -కె` లోనూ నటిస్తుంది. ఇది తెలుగులో దీపిక డెబ్యూ మూవీ.