Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరిః బ్లాక్‌ లో దీపిక మిలమిల

By:  Tupaki Desk   |   18 Feb 2016 9:30 AM GMT
ఫోటో స్టోరిః బ్లాక్‌ లో దీపిక మిలమిల
X
బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణే.. ఇప్పుడు ఇంటర్నేషనల్ స్టార్ కూడా అయిపోతోంది. రీసెంట్ గా బాజీరావ్ మస్తానీతో బ్లాక్ బస్టర్ సాధించిన ఉత్సాహం.. దీపికలో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. అదే జోష్ తో ఎంచక్కా హాలీవుడ్ కూడా వెళ్లిపోయి ట్రిపుల్ ఎక్స్:ది రిటర్న్ ఆఫ్ క్జాండర్ కేజ్ షూటింగ్ కూడా స్టార్ట్ చేసేసింది. విన్ డీజిల్ సరసన హాలీవుడ్ లో మెరిసిపోనుంది దీపికా పదుకునే.

ఇప్పుడీ ఇంటర్నేషనల్ సుందరి మోస్ట్ ఫేమస్ ఫ్యాషన్ మేగజైన్ కవర్ పేజ్ పైకి ఎక్కేసింది. ఫెమినా అంటూ మహిళా లోకంలో అత్యధికమైన క్రేజ్ ఉండే మేగజైన్. ఈ మేగజైన్ మార్చ్ ఎడిషన్ ముఖచిత్రంపై దీపిక తళుక్కుమంటోంది. బ్లాక్ డ్రస్ లో దీపిక అందాలు మిలమిలా మెరిసిపోతున్నాయి. ఈ నెలంతా బ్లాక్ డ్రస్ లో దీపికని.. అభిమానులతో మేగజైన్ రీడర్స్ కూడా చూసుకోవచ్చన్న మాట. ఆమె అందాలతో పాటు.. మొహంలో కనిపిస్తున్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మెచ్యూరిటీ ఆ చక్కని చుక్క అందాన్ని రెట్టింపు చేస్తున్నాయి.

ఇదిలా ఉంటే రీసెంట్ దీపికా పదుకునే టోక్యో తిరిగొచ్చేసింది. సింగిల్ కాదండోయ్.. వేలంటైన్స్ డే సందర్భంగా ఇలా చక్కర్లు కొట్టింది. అది కూడా ప్రియుడు రణ్ వీర్ సింగ్ తో కలిసి.. జపాన్ చుట్టేసింది. ఇటు బాలీవుడ్, అటు హాలీవుడ్, మరోవైపు లవ్ స్టోరీ.. దీపిక కెరీర్లో హ్యాపీయెస్ట్ సీజన్ ఇదే అనుకుంటా.