Begin typing your search above and press return to search.

సుశాంత్‌ మరణంను పబ్లిసిటీ కోసం వాడుకుంటుందా?

By:  Tupaki Desk   |   21 Jun 2020 6:10 AM GMT
సుశాంత్‌ మరణంను పబ్లిసిటీ కోసం వాడుకుంటుందా?
X
బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ రాజ్‌ పూత్‌ ఆత్మహత్య నేపథ్యంలో సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. పైకి చూడ్డానికి రంగుల జీవితం చాలా ఆనందంగా జీవితాన్ని గడుపుతున్నట్లుగా అనిపిస్తారు. కాని వారు పడుతున్న డిప్రెషన్‌ ఏకంగా ఆత్మహత్య చేసుకునేంత ఉంటుందని సుశాంత్‌ సంఘటన ద్వారా వెలుగులోకి వచ్చింది. సుశాంత్‌ ఆత్మహత్య తర్వాత ఎంతో మంది కూడా తాము గతంలో డిప్రెషన్‌ కు గురి అయ్యాము. చనిపోవాలనుకున్నాము అంటూ దీపిక పదుకునే వంటి స్టార్స్‌ వ్యాఖ్యలు చేశారు.

సుశాంత్‌ ఆత్మహత్య సమయంలో దీపిక పదుకునే చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షించాయి. ఇండస్ట్రీలో మరీ ఇలాంటి పరిస్థితులు ఉన్నాయా అంటూ కొందరు ఆవేదన వ్యక్తం చేశారు. సుశాంత్‌ చనిపోయినప్పటి నుండి కూడా దీపిక పదుకునే సోషల్‌ మీడియాలో వరుసగా పోస్ట్‌ లు పెడుతూ వస్తోంది. రిపీట్‌ ఆఫర్‌ మీ అంటూ డిప్రెషన్‌ కు సంబంధించి పలు పోస్ట్‌ లను నెట్టింట పోస్ట్‌ చేస్తూ ఉన్న దీపిక పదుకునే నేడు మరో పోస్ట్‌ చేసింది.

డిప్రెషన్‌ అనేది ఒక జబ్బు అనేది చెప్పిన ఆమె డిప్రెషన్‌ తో బాధపడుతున్న వారు ఏం చేయాలో చెప్పకుండా పబ్లిసిటీ కోసం రోజూ ఏదో ఒక పోస్ట్‌ పెడుతుంది అంటూ నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు. దీపిక పదుకునే ఈ విషయాన్ని కూడా తన పబ్లిసిటీ కోసం వాడుకోవడం దారుణం అంటూ మరికొందరు కామెంట్స్‌ చేస్తున్నారు. సుశాంత్‌ మరణం నేపథ్యంలో చాలా మంది సెలబ్రెటీలపై నెటిజన్స్‌ విమర్శలు గుప్పించారు. కొందరు చూపించి నెపొటిజం వారసుతోనే సినిమాలు తీయడం వల్లే సుశాంత్‌ వంటి మంచి నటులు చనిపోతున్నారు అంటూ ట్రోల్స్‌ చేస్తున్నారు. ఇప్పుడు దీపిక పదుకునే కూడా పబ్లిసిటీ కోసం ఇలాంటి పోస్ట్‌ లు చేస్తున్నావా ట్రోల్స్‌ ఎదుర్కటుంది.