Begin typing your search above and press return to search.
వెండి తెరపై దీపికా పదుకొణే @ 15 ఏళ్లు!
By: Tupaki Desk | 6 Aug 2022 8:30 AM GMTబాలీవుడ్ బ్యూటీ దీపీకా పదుకొణే కెరీర్ ప్రస్థానం గురించి చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం హిందీ పరిశ్రమని ఏల్తోంది. టాప్ -10 హీరోయిన్లలో ఒకరుగా వెలిగిపోతుంది. హీరోలతో రొమాటిక్ పాత్రలతో పాటు లేడీ ఓరియేంటెడ్ చిత్రాల్లోనూ సత్తా చాటుతోంది. అంతర్జాతీయ వేదికలపైనా తళుక్కున మెరిసే స్థాయికి చేరుకుంది. ఐశ్వర్యారాయ్ లాంటి అందాల్ని సైతం వెన్కి నెట్టి రేసులో నిలబడిందంటే రంగుల ప్రపంచం వైపు ఎంత కమిట్ మెంట్ తో ఉందో అద్దం పట్టింది.
తాజాగా ఈ బ్యూటీ కెరీర్ ప్రస్థానానికి 15 ఏళ్లు ముగిసాయి. తొలుత కన్నడ పరిశ్రమలో 'ఐశ్వర్య' చిత్రంతో ఎంట్రీ ఇచ్చినా అమ్మడు అక్కడ నటిగా కొనసాగలేదు. ఒక్క సినిమాతోనే కన్నడ పరిశ్రమలో లాభం లేదనుకుని బాలీవుడ్ పై దృష్టి పెట్టింది. అప్పటికే మోడలింగ్ రంగంలో పేరు సంపాదించిన బ్యూటీకి అనుకోకుండా తొలి సినిమా తోనే షారుక్ ఖాన్ తో నటించే అరుదైన అవకాశం అందుకుంది.
అదే 'ఓంషాంతి ఓం'. ఈ సినిమా సక్సెస్ గురించి చెప్పాల్సిన పనిలేదు. 30 కోట్ల బడ్జెట్ తో నిర్మాణమైన సినిమా 150 కోట్ల వసూళ్లని తేవడంలో దీపిక పాత్ర హైలైట్ అయింది. దీంతో స్టార్ హీరోలంతా దీపిక కి వరుసగా అవకాశాలు కల్పించారు. యంగ్ హీరోల నుంచి సీనియర్ హీరోల వరకూ ప్రతీ ఒక్కరు బ్యూటీతో పనిచేయడానికి ఎంతో ఆసక్తి చూపించారు.
ఇప్పటివరకూ 35 సినిమాలకు పైగా పనిచేసింది. 'బచ్ నే హసీనో'..'చాందిని చౌక్ టు చెన్నై'..'లవ్ ఆజ్ కల్'..'హౌస్ ఫుల్'.. 'దేశీ బోయ్స్'..'కాక్ టెయిల్'..'రేస్ -2'..'యే జవానీ హై దివానీ'..'చెన్నై ఎక్స్ ప్రెస్'.. 'రామ్ లీల'..'పద్మావత్'..'తమాషా'..'బాజీరావ్ మస్తానీ'.. 'పికు'లాంటి ఎన్నో సక్సెస్ ఫుల్ చిత్రాల్లో దీపీక భాగమైంది.
15 ఏళ్ల ప్రయాణం పూర్తయిన సందర్భంగా దీపిక మనసుకు దగ్గరైన ఓ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పుకొచ్చింది. 'పీకు' సినిమాలో తన పాత్ర అంటే ఎంతో ఇష్టమట. ''ఇష్టమైన పాత్ర అనే కాదు. ప్రస్తుత నా జీవిత దశకు పీకు పాత్ర చాలా దగ్గరగా ఉంటుంది. నేను..నా సోదరి ఇద్దరం ఆ పాత్రకి బాగా కనెక్ట్ అవుతాం. ఇప్పటివకూ ఎన్నో పాత్రలు పోషించాను.
కానీ 'పీకు' పాత్ర మాత్రం ఎప్పటికీ ప్రత్యేకమే. బహుశా నా నిజ జీవితానికి దగ్గరగా ఉండటం వల్లే అంతగా కనెక్ట్ అయ్యాను. సహ నటులు ఒకరితో ఒకరు పోటీ పడకుండా పరస్పర సహకారంతో ఉంటే ఆ నటన ఎంతో నిజాయితీగా ఉంటుంది. 'పీకు' విషయంలో ఇలాంటివి జరిగాయని' చెప్పుకొచ్చింది.
ప్రస్తుతం ఈ బ్యూటీ 'ప్రాజెక్ట్ -కె'తో టాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన నటిస్తుంది. దీపిక-ప్రభాస్ జంటని వెండి తెరపై చూడాలని అభిమానులు సహా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇద్దరు పర్ పెక్ట్ జోడీ కావడంతో అభిమనుల్లో ఆసక్తి మరింత పెరిగిపోతుంది.