Begin typing your search above and press return to search.

ర‌ణ్ బీర్ తో బ్రేక‌ప్ కు కార‌ణ‌మిదే:దీపికా

By:  Tupaki Desk   |   24 July 2018 1:43 PM GMT
ర‌ణ్ బీర్ తో బ్రేక‌ప్ కు కార‌ణ‌మిదే:దీపికా
X
`మ‌హాన‌టి` సినిమాలో .....త‌న భ‌ర్త జెమిని గ‌ణేష‌న్.....వేరే మ‌హిళ‌తో రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోవ‌డంతో సావిత్రి ఆగ్ర‌హంతో ఊగిపోతుంది. ఇక‌పై జెమినీతో బంధం కొన‌సాగించ‌న‌ని తెగేసి చెబుతుంది. అత‌డితో తెగ‌దెంపులు చేసుకొని ఒంట‌రిగా జీవిస్తుంది. త‌న‌తో బంధాన్ని నెరుపుతూనే మ‌రొక‌రితో సంబంధం పెట్టుకోవడం ఏ మాత్రం రుచించ‌ని సావిత్రి .....భ‌ర్త‌తో విడిపోవాల‌నే క‌ఠిన నిర్ణ‌యం తీసుకుంటుంది. స‌రిగ్గా సావిత్రికి రీల్ లైఫ్ లో జ‌రిగిన సీన్....యాజ్ ఇట్ ఈజ్ గా బాలీవుడ్ బ్యూటీ దీపికా ప‌దుకొణేకు రియ‌ల్ లైఫ్ లో జ‌రిగిందట‌. తానెంతో గాఢంగా ప్రేమించిన ర‌ణ్ బీర్ క‌పూర్ ......క‌త్రినా కైఫ్ తో రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడని....అందుకే అత‌డితో బ్రేక‌ప్ అయ్యింద‌ని చెప్పింది. ఆ ఘ‌ట‌న‌తో తాను మాన‌సికంగా చాలా కుంగిపోయాన‌ని తెలిపింది.ఓ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రణ్‌బీర్ తో రిలేషన్, బ్రేక‌ప్ గురించి ఆసక్తికరమైన విష‌యాల‌ను వెల్లడించింది.

2007లో తామిద్ద‌రం గాఢంగా ప్రేమించుకున్నామ‌ని, ఆ స‌మ‌యంలో ర‌ణ్ వీర్ ను బాగా నమ్మాన‌ని దీపికా చెప్పింది. అయితే, ఒక రోజు కత్రినాకైఫ్ తో ర‌ణ్ బీర్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ‌డంతో తాను చాలా కుంగిపోయానని, అందుకే త‌మ రిలేష‌న్ షిప్ న‌కు వెంట‌నే గుడ్‌బై చెప్పాన‌ని తెలిపింది. ఆ త‌ర్వాత ర‌ణ్ వీర్ క్ష‌మాప‌ణ‌లు చెప్పాడ‌ని, సెకండ్ ఛాన్స్ కోసం వెంట పడ్డాడని చెప్పింది. త‌న దృష్టిలో సెక్స్ అంటే శారీరక సుఖం మాత్ర‌మే కాద‌ని, అదో భావోద్వేగమ‌ని, తాను ర‌ణ్ బీర్ ను చీట్ చేయలేద‌ని చెప్పింది. అందుకే, రణ్‌బీర్ కు రెండో చాన్స్ ఇవ్వ‌లేద‌ని, మ‌రోసారి ఫూల్ కావ‌డం ఇష్టం లేద‌ని చెప్పింది. రణ్‌ బీర్‌ తో రిలేషన్ త‌న‌కో పెద్ద గుణపాఠమ‌ని, ఓ వ్యక్తిని గుడ్డిగా నమ్మకూడ‌ద‌ని తెలుసుకొన్నానని చెప్పింది. బ్రేకప్ తర్వాత త‌న‌ను తానుగా గౌరవించుకొన్నాన‌ని, మానసికంగా చాలా కష్టాలు అనుభవించాన‌ని చెప్పింది. ఆ విషాదం నుంచి బయటపడి మంచి మనిషినయ్యానని, అందుకే రణ్‌బీర్ కు రుణపడి ఉంటాన‌ని దీపిక చెప్పింది.