Begin typing your search above and press return to search.

ప్రియాంకతో రిలేషన్ పై దీపిక కామెంట్!

By:  Tupaki Desk   |   5 Nov 2016 5:35 AM GMT
ప్రియాంకతో రిలేషన్ పై దీపిక కామెంట్!
X
ఇప్పుడు మిత్రులనుకున్నవారు రేపు దుమ్మెత్తిపోసుకోవచ్చు, కత్తులు దూసుకోవచ్చు.. నేడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వ్యక్తులు భవిష్యత్తులో పీకల్లోతు ప్రేమలో మునిగిపోవచ్చు. సాదారణంగా ఇది రాజకీయాల్లో వాడే డైలాగ్... రాజకీయాల్లో శాస్వత మిత్రులు - శాస్వత శత్రువులూ ఉండరనేది. అయితే ఇది రాజకీయాల్లోనే కాదు సినిమావాళ్లకూ బాగానే వర్తిస్తుంది. ఈ లిస్ట్ లో బాలీవుడ్ బ్యూటీ క్వీన్స్ ప్రియాంక చోప్రా - దీపికా పదుకోన్ ఎప్పుడోచేరిపోయారని గతంలో గాసిప్స్ వచ్చేవి. అయితే తాజాగా మరోసారి ఈ బంధం ఇప్పుడు ఒడిదొడుకుల్లోనే ఉందని అనుకుంటున్నారట. దీంతో దీపిక స్పందించింది!!

దీపిక - ప్రియాంకల మధ్య అస్సలు పొసగడం లేదని, బెస్ట్ ఫ్రెండ్స్ గా మన్ననలందుకున్న వీరు ప్రస్తుతం ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారని ఈమధ్య ఎక్కువగా చెప్పుకుంటున్నారు. అయితే గతంలో కూడా ఇలాంటి కామెంట్స్ వస్తే... ఇదంతా మీడియా సృష్టే అని ప్రియాంక చోప్రా కొట్టిపారేసిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో దీపిక కూడా సమయం వచ్చినప్పుడల్లా తమ మధ్య ఎలాంటి విబేధాలు లేవని చెప్తూనే ఉంది. అలాగే మరోసారి ఇదేవిషయాన్ని ఇంకాస్త గట్టిగా చెప్పింది దీపిక!

తమ మధ్య విబేధాలు వచ్చాయని, తాము ఇకమీదట ఫ్రెండ్స్ కాదని రకరకాలుగా వార్తలొస్తున్నాయని దీపిక మరోసారి స్పందించింది. ఈ విషయంలో అందరికీ ఒకమాట చెప్పాలనుకుంటుందట. ఈ సందర్భంగా... "ఆమె మార్గం వేరు.. నా గోల్స్ వేరు. ప్రియాంక తన కెరియర్ నుంచి కోరుకుంటున్న దానికి నేను ఆశిస్తున్నదానికీ సంబంధమే లేదు" అని దీపిక చెప్పుకొచ్చింది. ప్రియాంకతో తనకు ఎలాంటి ఇబ్బందులూ లేవని, మొదట్లో తమ బంధం ఎలా ఉందో, ఇప్పటికీ అలానే ఉందని, తమ రిలేషన్ లో ఈక్వేషన్స్ ఏమీ మారలేదని చెప్పింది.

కాగా క్వాంటికో సిరీస్ ద్వారా హాలీవుడ్ లో ప్రియాంక మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇదే క్రమంలో "బేవాచ్" సినిమాలో కీలకమైన విలన్ రోలే చేస్తోంది. అలాగే దీపిక కూడా "ట్రిపుల్ ఎక్స్.." మూవీతో హాలీవుడ్ అరంగేట్రం చేస్తోంది. దీంతో వీరి మధ్య పోటీ పెరిగి విబేధాలకు తావిచ్చిందన్నది కొన్ని నెలలుగా సాగుతున్న ప్రచారం. దీంతో మరోసారి వారి బంధంపై దీపిక ఒక ఇంటర్వ్యూలో స్పందించింది!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/