Begin typing your search above and press return to search.

హీరోయిన్ల పేకటా గోలేటండీ బాబూ!!

By:  Tupaki Desk   |   15 Nov 2015 3:30 PM GMT
హీరోయిన్ల పేకటా గోలేటండీ బాబూ!!
X
మొన్ననే బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ దీపికా పదుకొనె తన ప్రియుడు.. అదేనండీ.. ప్రస్తుత సినిమా 'తమాషా'లో ప్రియుడు.. రియల్‌ లైఫ్‌ లో మాజీ ప్రియుడు.. రణబీర్‌ కపూర్‌ తో కలసి పేకాట ఆడేసింది. అదంతా తమాషా సినిమా ప్రమోషన్‌ సందర్భంగా దీపావాళి నాడు జరిగిన వింత. ఇకపోతే మన సెక్సీ లేడీ శ్రద్దా దాస్‌ కూడా ఇలాగే పేకాట ఆడేసి ఆ ఫోటోలను ట్విట్టర్‌ లో పెట్టేసింది. అవి కూడా పెద్ద రచ్చే. ఇంతకీ అసలు ఈ పేకటా గోల ఏంటి మరి?

వీళ్లందరూ సరదాగా దీపావళి కి పేకాట ఎందుకు ఆడారో.. అదేమైనా ఒక ట్రెడిషనా అనే విషయం పక్కనెడితే.. ఇప్పుడు చాలామంది స్టార్‌ హీరోయిన్లు.. పెద్ద పెద్ద హీరోలు.. రియల్‌ లైఫ్‌ లో బెట్టింగులకు పేకాట ఆడుతున్నారని తెలుస్తోంది. రమ్మీ, పోకర్‌ వంటి గేములు కొందరు సాఫ్టువేర్‌ బాబులూ ఆన్ లైన్‌ లో ఆడుతుంటే.. ఈ హాట్‌ సెలెబ్స్‌ మాత్రం ఎప్పుడంటే అప్పుడే తమ క్యారవ్యాన్లలో, లేకపోతే ప్రత్యేకమైన ఫామ్‌ హౌస్‌ పార్టీల్లో ఆడుతున్నారట. దీనివలన ఒరిగేది ఏమైనా ఉందా అంటే.. నాది లచ్చ పోయింది నాది యాభై లెగిసింది అంటూ గొప్పలు చెప్పుకోవడమే సరిపోతోందట.

అంతా బాగానే ఉంది. ఇప్పుడు కోట్లలో ఆదాయం ఉంది కాబట్టి.. లచ్చ పోయిందని గొప్పగా చెప్పుకొంటున్నారు. అదే సీన్‌ సితారయ్యి కెరియర్‌ రివర్ష్‌ అయితే పరిస్థితేంటో?? అప్పుడు ఈ అలవాటు మానుకోగలరా? ఒకవేళ ఇంతలోనే ఏదో పోలీస్‌ రెయిడ్‌ లో పేరు బయటకొచ్చి మీడియాలో ఒక క్లిప్పింగ్‌ వచ్చిందనుకోండి.. పరువు గంగలో కాదు.. హైదరాబాద్‌ మూసీలో కలసిపోద్ది.