Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ: పెళ్ల‌యితే ఇంతేనా?

By:  Tupaki Desk   |   23 Dec 2018 5:30 PM GMT
ఫోటో స్టోరీ: పెళ్ల‌యితే ఇంతేనా?
X
సెప్టెంబర్ మాసం సెప్టెంబర్ మాసం.. పాత బాధలు తలెత్తనివ్వం..
అక్టోబర్ మాసం అక్టోబర్ మాసం కొత్త బాధలు తలెత్తుకున్నాం..
... బాధ తీరున‌దెప్పుడో ...! సెప్టెంబర్ మాసం సెప్టెంబర్ మాసం...!!

`స‌ఖి` సినిమాలోని ఈ పాట‌లానే ఉంది దీపిక స‌న్నివేశం. సెప్టెంబ‌ర్ వెళ్లింది. అక్టోబ‌ర్ వెళ్లింది. న‌వంబ‌ర్‌ లో పెళ్ల‌య్యింది. ఆ త‌ర్వాత హ‌నీమూన్ అంటూ ఎక్క‌డికి వెళ్లాలో అర్థంగాక క‌న్ఫ్యూజ‌న్ లో ప‌డిపోయింది. ఓవైపు బిజీ క‌మిట్‌ మెంట్స్ తో హ‌డావుడి. దాని ప‌ర్య‌వ‌సానం వ‌ల్ల‌ హ‌బ్బీకి ఎడంగానే ఉండాల్సొచ్చింది. ప్ర‌స్తుతం ర‌ణ‌వీర్ `సింబా` చిత్రీక‌ర‌ణ‌లో బిజీబిజీగా ఉండ‌డంతో దీపిక త‌న అసైన్ మెంట్స్ తో తాను బిజీగా ఉంది.

డిసెంబ‌ర్‌ మాసం అసైన్‌ మెంట్స్‌ లో భాగంగా ఇదివ‌ర‌కూ ప్ర‌ఖ్యాత‌ మ్యాగ్జిమ్ క‌వ‌ర్‌ షూట్‌ లో పాల్గొంది. ఆ ఫోటోషూట్ నుంచి ఓ ఫోటో ఒక‌టి సామాజిక మాధ్య‌మాల్లోకి వ‌చ్చింది. మ్యాగ్జిమ్ సంస్థ అధికారికంగా ఈ ఫోటోని రివీల్ చేసింది. ఇందులో దీపిక వైట్ & బ్లాక్ కాంబినేష‌న్ డ్రెస్ లో వేడి పెంచింది. ముఖ్యంగా టాప్‌లో తెల్ల చొక్కా బ‌ట‌న్స్ ఓపెన్ చేసి ఇన్‌ వోర్ లో అందాల్ని ఎలివేట్ చేయ‌డం చూస్తుంటే - దీపిక ఏమాత్రం త‌గ్గ‌లేద‌నిపించ‌క మాన‌దు. అస‌లు పెళ్ల‌యినా ఇంతేనా? అంటూ ఒక‌టే యూత్ లో డిష్క‌స‌న్ సాగుతోంది. దీపిక స్ట‌న్నింగ్ అప్పియ‌రెన్స్ మ‌తి చెడ‌గొట్టిందంటే న‌మ్మండి.