Begin typing your search above and press return to search.

దీపిక‌ను క్ష‌ణ‌మైనా విడిచి ఉండ‌లేడా?

By:  Tupaki Desk   |   2 Dec 2020 3:30 AM GMT
దీపిక‌ను క్ష‌ణ‌మైనా విడిచి ఉండ‌లేడా?
X
బాలీవుడ్ హాట్ క‌పుల్ దీపిక‌-ర‌ణ‌వీర్ ఎవ‌రికి వారు వేర్వేరు షూటింగుల్లో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం సిద్దాంత్ స‌ర‌స‌న దీపిక న‌టిస్తోంది. ర‌ణ్ వీర్ వేరే ప్రాజెక్టుతో బిజీగా ఉన్నారు. ఆ క్ర‌మంలోనే దీపిక షూటింగ్ స్పాట్ కి వ‌చ్చిన ర‌ణ‌వీర్ త‌న‌తో క‌లిసి కొంత స‌మ‌యం గ‌డిపిన‌ప్ప‌టి ఫోటోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారాయి.

సిద్ధాంత్ చతుర్వేదితో షూటింగ్ కోసం బయలుదేరిన దీపికా పదుకొనే కి హబ్బీ రణవీర్ సింగ్ ముద్దు ఇస్తున్న ఫోటో ప్ర‌స్తుతం ‌వైర‌ల్ అవుతోంది. ముంబై అలీబాగ్ ‌లో షకున్ బాత్రా తదుపరి చిత్రానికి షూట్ చేస్తున్నప్పుడు దీపికా పదుకొనే రణ్‌వీర్ సింగ్ ‌తో కొంత సమయం గ‌డిపారు. ఆ ఫోటోలు వైర‌ల్ అయ్యాయి.

సిద్ధాంత్ చతుర్వేది- షకున్ బాత్రా మూవీ షూటింగ్ లో దీపిక‌ బిజీ. కానీ తన భర్తతో కొంత సమయం కేటాయించే అవ‌కాశాన్ని దీపిక వ‌దిలిపెట్ట‌క‌పోవ‌డం అభిమానుల్లో చ‌ర్చ‌కు వ‌చ్చింది.

ఈ చిత్రం షూటింగ్ కోసం బృందం బయలుదేరే ముందు ముంబైలోని తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్ లో ఆమెను వదిలివేయడానికి వచ్చినప్పుడు రణవీర్ భార్య‌‌తో క‌నిపించాడు. షూటింగ్ కోసం బయలుదేరేటప్పుడు దీపిక చెంపపై పెక్ (ముద్దు) ఇచ్చే ముందు ఇద్దరూ కలిసి సమయం గడపడం కనిపించింది. ఈ చిత్రం అలీబాగ్ వద్ద చిత్రీకరణ జ‌రుపుకుంటోంది. దీపిక - సిద్ధాంత్ సీన్ షూట్ కోసం బయలుదేరినప్పుడు పడవలో కనిపించారు.

కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో దీపిక తో పాటు సిద్ధాంత్ - అనన్య జోడీగా న‌టిస్తున్నారు.ఇప్పుడు ముంబైలో చిత్రీకరిస్తున్నారు. దీని మొదటి షెడ్యూల్ గత నెలలో గోవాలో పూర్త‌యింది. ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రారంభంలో విడుదల కానుంది.