Begin typing your search above and press return to search.
పెళ్లి లాగే దీపవీర్ ల రిసెప్షన్ కూడా..!
By: Tupaki Desk | 21 Nov 2018 1:40 PM GMTబాలీవుడ్ స్టార్ జంట రణ్ వీర్ సింగ్ మరియు దీపిక పదుకునేలా వివాహం ఈమద్య ఇటలీలో వైభవంగా జరిగిన విషయం తెల్సిందే. రెండు సాంప్రదాయాల ప్రకారం వీరి వివాహం జరిగింది. వివాహ వేడుకలో అతి కొద్ది మంది మాత్రమే పాల్గొన్నారు. అతి దగ్గరి బంధువులు - ఆప్తులకు మాత్రమే ఆహ్వానం ఇచ్చిన ఈ జంట రిసెప్షన్ కు మాత్రం భారీగా అతిథులను ఆహ్వానించారు. నేడు సాయంత్రం బెంగళూరులోని లీలా మహల్ హోటల్ లో ఈ వివాహ రిసెప్షన్ జరుగుతోంది.
ఈ వేడుకలో మరోసారి కొత్త జంట తలుక్కుమనబోతున్నారు. అంతర్జాతీయ స్థాయి డిజైనర్ రూపొందిన డ్రస్ లతో వీరిద్దరు కూడా రిసెప్షన్ లో పాల్గొనబోతున్నారు. ఇక బాలీవుడ్ తో పాటు కన్నడ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు మరియు రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు ఈ వివాహ రిసెప్షన్ లో పాల్గొనబోతున్నారు. వచ్చిన గెస్ట్ ల కోసం అద్బుతమైన ఏర్పాట్లను హోటల్ యాజమాన్యం ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది.
దాదాపు వంద రకాల వంటలతో విందు బోజనంను హోటల్ యాజమాన్యం గెస్ట్ లకు ఏర్పాటు చేయడం జరిగిందట. ఉత్తర భారతదేశ - దక్షిణ భారత దేశంకు చెందిన ప్రముఖ వంటలతో పాటు - విదేశీ వంటకాలను కూడా మెనూలో చేర్చడం జరిగిందట. ఈ వివాహ రిసెప్షన్ వింధును ఏ ఒక్కరు కూడా మర్చి పోకుండా దీపవీర్ లు ప్లాన్ చేశారు. పెళ్లిని ఇటలీలో అత్యంత వైభవంగా జరుపుకుని అందరి దృష్టిని ఆకర్షించిన వీరు రిసెప్షన్ తో కూడా వావ్ అనిపించుకుంటున్నారు.