Begin typing your search above and press return to search.
సవతితో మాజీ ప్రియుడి కులుకుపై ఆవిడేమంది?
By: Tupaki Desk | 21 Feb 2020 2:30 AM GMTకత్రిన-రణబీర్- దీపిక ముక్కోణ ప్రేమకథ గురించి తెలిసిందే. దీపికతో రణబీర్ నిండా ప్రేమలో మునిగి ఉండగానే కత్రిన అతడి జీవితంలోకి ప్రవేశించింది. నిజానికి బాలీవుడ్ లో లవ్ బర్డ్స్ అంటే రణబీర్ - దీపిక జంట మాత్రమే. అంత ఘాడమైన ప్రేమ ఆ ఇద్దరిదీ. ఆ ఇద్దరూ పెళ్లాడితే చూడాలని అభిమానులు కలలు కనేవారు. కానీ అతడు ఆమె మధ్య ఈమె ప్రవేశించడంతోనే అతడి కథ చివరికి కంచికి చేరిపోయింది. ఈ కథలో అతడు ఏదో అయ్యాడు.. ఆమె ఎటో వెళ్లిపోయింది. ఇప్పుడు అతడిని ప్రేమించిన దీపిక మాత్రం వేరొక హీరో రణవీర్ సింగ్ ని పెళ్లాడి జీవితంలో సెటిలైంది.
ఇదంతా ఇప్పుడే ఎందుకని గుర్తు చేసుకోవాలి? అంటే దానికి సందర్భం కలిసొచ్చింది. అప్పట్లోనే రణబీర్ ఇంకా తనని ప్రేమిస్తూనే ఉన్నాడని కలలు గంటున్న దీపికకు ఉన్నట్టుండి బిగ్ షాక్ తగిలింది. కత్రినా కైఫ్ - రణబీర్ కపూర్ `ఐబిజా` తీరంలో సరిగంగ స్నానాలు ఆడుతూ ఉన్న ఫోటోలు అంతర్జాలంలో లీకై సంచలనం అయ్యాయి. ఆ ఫోటోలు నెట్ లో రాగానే దీపిక కుతకుత ఉడికింది. అప్పటివరకూ కత్రినతో రణబీర్ లవ్వాయణం మీడియాకు అధికారికంగా తెలీదు. ఐబిజా ట్రిప్ నుండి రణబీర్ కపూర్ - కత్రినా కైఫ్ ఫోటోలు ఆన్ లైన్ లో వైరల్ అవ్వడంతోనే ఆ వ్యవహారం రివీలైంది. అప్పటివరకూ ప్రైవేటుగా సాగిన వ్యవహారం కాస్తా ఓపెన్ అయిపోయింది. కత్రినా- రణబీర్ జంట రొమాన్స్ వార్తాపత్రికల మొదటి పేజీలలో హైలైట్ చేశారు. అంతకుముందు రణబీర్ స్నేహితుడు అయాన్ ముఖర్జీ విందు లోనూ ఆ ఇద్దరూ కలిసి కనిపించారు. అటుపైనా ఇబిజాలో జంటగా వేడిని పెంచారు.
ఆ టైమ్ లో ఆ లీకులపై రణబీర్ మాత్రమే కాదు.. కత్రినా కూడా తీవ్రంగా కలతకు గురైందట. నా అనుమతి లేకుండా ఫోటోలు తీసి వ్యాపారం చేస్తారా? అంటూ రణబీర్ ఎంతో సీరియస్ అయ్యాడు. ఇలాంటి జర్నలిజం తగదు అని సెలవిచ్చాడు రణబీర్. `బొంబాయి వెల్వెట్` సెట్స్ లో ఉన్నప్పుడు కత్రినా రణబీర్ తో కలిసి శ్రీలంకకు వెళ్లిందని కూడా మీడియాలో పుకార్లు వచ్చాయి. ఇక ఇబిజ నుంచి ఆ ఫోటోలు లీకైనప్పుడు దీపిక ఎలా స్పందించింది? అంటే ఎంతో హుందాగానే వ్యవహరించడం తాజాగా అభిమానుల్లో చర్చకు వచ్చింది. ``ఇలా ప్రయివేటు ఫోటోల లీకవ్వడం నా విషయంలో ఎప్పుడూ జరగలేదు. ఒక సెలబ్రిటీ లేదా పబ్లిక్ ఫిగర్ అయితే ఇవన్నీ తప్పదు. అయినా నేను ఎవరినీ (మీడియాని) నిందించను. నేను పబ్లిక్ ఫిగర్ ని కాబట్టి ఎవరైనా నన్ను కెమెరాలో బంధించాలని అనుకుంటే... నేను కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది.. మీరు ఒక స్టార్ .. పబ్లిక్ ఫిగర్ అయితే ... ప్రజలు మీ గురించి మాట్లాడుతారు ... మీరే చాలా జాగ్రత్తగా ఉండాలి`` అంటూ వ్యాఖ్యానించింది. ఆ తర్వాత రణబీర్ సైతం దీపిక ముందు తలెత్తుకోలేకపోయాడు. ప్రస్తుతం రణబీర్ `బ్రహ్మాస్త్రా` సహనటి అలియా భట్ తో డేటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే కత్రిన విక్కీ కౌశల్ తో డేటింగ్ చేస్తోందని ప్రచారం అవుతోంది. అయితే దీనికి అధికారికంగా ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు. దీపిక మాత్రం రణవీర్ ని పెళ్లాడి హ్యాపీ లైఫ్ ని లీడ్ చేస్తోంది. ఆ ముగ్గురి ప్రేమకథలు అలా అటూ ఇటూ తిరిగాయన్నమాట.