Begin typing your search above and press return to search.

నేనా? ప్రియాంక తోనా? నో!!

By:  Tupaki Desk   |   26 Jun 2016 4:45 AM GMT
నేనా? ప్రియాంక తోనా? నో!!
X
ప్రియాంక చోప్రా.. దీపికా పదుకొనే.. ఇద్దరిలోనూ ఇప్పుడు కొన్ని పోలికలు కనిపిస్తాయి. ఇద్దరూ బాలీవుడ్ నుంచి హాలీవుడ్ లో సినిమాలు చేసేస్తున్నారు. రెండు ఇండస్ట్రీలను హ్యాండిల్ చేస్తున్నారు. గతేడాది చివర్లో వచ్చిన బాజీరావ్ మస్తానీలో కలిసి కనిపించారు. ఆడి పాడారు కూడా. అందుకే వీరిద్దరితో ఒకేసారి స్టేజ్ పై డ్యాన్స్ చేయించాలనే ఆలోచన వచ్చింది ఓ ఈవెంట్ ఆర్గనైజర్లకి.

ప్రస్తుతం స్పెయిన్ లో జరగుతున్న అవార్డ్ ఫంక్షన్ లో.. ప్రియాంక చోప్రా- దీపికా పదుకొనేలు స్టేజ్ పై డ్యాన్స్ పెర్ఫామెన్స్ ఇవ్వనున్నారు. అయితే.. ఈ కార్యక్రమంలో వీరిద్దరితో కలిపి పెర్ఫామెన్స్ ఇచ్చే ప్రతిపాదన కూడా ఉంది. దీన్ని దీపిక ముందుంచినపుడు.. ఆమె రియాక్షన్ చూసి వాళ్లు షాక్ తిన్నారు. మొదట ఈ ప్రపోజల్ పై ఉత్సాహం చూపిన దీపిక.. చివరకు పీసీతో పెర్ఫామెన్స్ కు నో చెప్పేసింది. దీంతో ఈ ప్రతిపాదన అటకెక్కింది. ఇద్దరూ ఎవరికి వారే డ్యాన్సులు చేసుకోబోతున్నారు.

ఈ కంబైన్డ్ పెర్ఫామెన్స్ విషయంలో ప్రియాంక మాత్రం ఓకే అనిందని.. దీపిక నో చెప్పడంతోనే ఆగిందనే టాక్ వినిపిస్తోంది. అయితే.. ప్రియాంకతో స్టేజ్ పంచుకోవడానికి దీపిక ఎందుకు నో చెప్పిందో మాత్రం ఎవరికీ అర్ధం కాలేదు. ప్రొఫెషనల్ గా పోటీ తప్పితే.. ప్రియాంక- దీపికలకు ఎలాంటి శతృత్వం లేదనే విషయం అందరికీ తెలిసిందే.