Begin typing your search above and press return to search.

హీరోలకి పదిచ్చి.. హీరోయిన్ కి పదమూడు

By:  Tupaki Desk   |   30 Aug 2017 4:29 AM GMT
హీరోలకి పదిచ్చి.. హీరోయిన్ కి పదమూడు
X
ఒకప్పుడు హీరోయిన్స్ ఎంత మంచి క్యారెక్టర్ చేసినా హీరో కంటే తక్కువగానే చూసేవారు. ముఖ్యంగా పారితోషికం విషయంలో అయితే హీరోయిన్స్ ఎంత చెమటోడ్చినా హీరోలకంటే తక్కువగానే ఇచ్చేవారు. అయితే ఈ మధ్య హీరోయిన్లు లేడి ఓరియెంటెడ్ సినిమాలతో ఆదరగొడుతూ భారీ మొత్తంలో రెమ్యునరేషన్ ను అందుకుంటున్నారు. కానీ హీరోస్ తో జోడి కట్టేసరికి హీరోలకంటే తక్కువగా ఇస్తూ అవమనపరచడం ఇప్పటి హీరోయిన్స్ కి అస్సలు నచ్చడం లేదు.

ఈ పక్షపాత ధోరణి మారాలంటూ ఇప్పటికే చాలామంది హీరోయిన్లు మొరపెట్టుకున్న విషయం తెలిసిందే. కానీ అనూహ్యంగా దీపికా పదుకొనె ఇద్దరు స్టార్ హీరోలతో నటిస్తూ.. వారి కంటే ఎక్కువ వేతనాన్ని తీసుకుంటోంది. సంజయ్ లీలా బన్సాలి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న "పద్మావతి" సినిమాలో దీపికతో పాటు షాహిద్ కపూర్ - రన్వీర్ సింగ్ లు నటిస్తున్నారు. అయితే ఈ సినిమా కోసం దీపికా 13 కోట్ల రెమ్యూనరేషన్ ను తీసుకుంటుండగా.. షాహిద్ - రన్వీర్ లకు మాత్రం చెరోక 10 కోట్లను ఇస్తున్నారట. ఎందుకంటే సినిమాలో ఈ హీరోలిద్దరికంటే దీపిక పాత్రకు ఎక్కువగా స్కోప్ ఉండటం వల్ల ఆమె చాలా కష్టపడుతోంది. దీంతో ఆమెకు హీరోలిద్దరికంటే ఎక్కువ రెమ్యునరేషన్ ను ఇస్తున్నారట.

అయితే అందుకు రన్వీర్ - షాహిద్ లు కూడా ఏ విధమైన అభ్యంతరాన్ని చెప్పలేదట. మొత్తానికి మొదటి సారి ఇద్దరి స్టార్ హీరోలకంటే ఎక్కువ పారితోషకం తీసుకోవడంతో ఈ పరిణామం మిగతా హిరయిన్స్ కి కూడా కలుగుతుందో లేదో చూడాలి. ఇక ఈ సినిమాను నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.