Begin typing your search above and press return to search.
దీపికా.. నీకిది తగునా?
By: Tupaki Desk | 18 Jan 2018 4:52 AM GMTఈమధ్య కాలంలో విడుదలకు ముందే విపరీతమైన వివాదాల్లో చిక్కుకున్న సినిమా పద్మావత్. బాలీవుడ్ లో భారీ చిత్రాల దర్శకుడైన సంజయ్ లీలా భన్సాలీ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా తమ మనోభావాలను దెబ్బతీసేలా ఉందంటూ రాజ్ పుత్ కర్ణిసేన చేస్తున్న ఆందోళనలు ఈ సినిమా రిలీజ్ పై తీవ్ర ప్రభావం చూపాయి. ముందు అనుకున్నట్టుగా కాకుండా రిలీజ్ వాయిదా పడి చివరకు అన్ని అడ్డంకులు దాటుకుని 25న థియేటర్లకు రానుంది.
ఈ సినిమాను లార్జన్ దేన్ లైఫ్ తరహాలో చిత్రీకరించడంతో భారీగానే ఖర్చయింది. ఈ నేపథ్యంలో వీలయినంత ఎక్కువ మంది ప్రేక్షకులకు రీచ్ అవాలనే ఉద్దేశంతో తెలుగు.. తమిళ భాషల్లోనూ డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా తమిళ్ పోస్టర్ ను.. ట్రయిలర్ ను హీరోయిన్ దీపికా పదుకునే తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ అందరికీ షేర్ చేసింది. తెలుగులో వస్తోందనే విషయం పెట్టింది కానీ తెలుగు పోస్టర్ మాత్రం పోస్ట్ చేయలేదు. తమిళం పోస్టర్.. ట్రయిలర్ రెండూ పెట్టి ఈ సినిమా డబ్బింగ్ అవుతున్న విషయం చెప్పి తెలుగు పోస్టర్ గురించి అసలు పట్టించుకోనే పట్టించుకోక పోవడం రెండు తెలుగు రాష్ట్రాల్లోని దీపిక అభిమానులను తీవ్రంగా హర్ట్ చేసింది.
సినిమా బాగుంటే చాలు.. భాషతో సంబంధం లేకుండా నెత్తిన పెట్టుకోవడం తెలుగు ప్రేక్షకులకు అలవాటే. అందుకోసమే పనిగట్టుకుని పద్మావత్ తెలుగు వెర్షన్ ను రిలీజ్ చేస్తున్నారు. కానీ ప్రమోషనేమో తమిళ పోస్టర్ తో సరిపెట్టేయడం ఏం బాలేదని అభిమానులు పెదవి విరుస్తున్నారు. పద్మావత్ లో రాణి పద్మావతి భర్త పాత్రలో షాహిద్ కపూర్ నటించగా.. విలన్ అల్లావుద్దీన్ ఖిల్జీ పాత్రలో రణ్ వీర్ సింగ్ కనిపిస్తాడు.