Begin typing your search above and press return to search.

పారిస్ ను ఉర్రుతలూగిస్తున్న పద్మావతి

By:  Tupaki Desk   |   17 Jan 2018 10:30 AM GMT
పారిస్ ను ఉర్రుతలూగిస్తున్న పద్మావతి
X
సినిమా అనౌన్స్ చేసినప్పటినుంది ఎన్నో వివాదాలలో ఇరుక్కుంటూ, అతి కష్టం మీద షూటింగ్ పూర్తి చేసుకుని చిట్ట చివరకు జనవరి 25న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం పద్మావతి ఉరఫ్‌ పద్మావత్. విడుదల అవడమే గగనంలా మారిన తరుణం లో ప్రొమొషన్స్ లో పాల్గొని సినిమాను మరింత ఇరకాటంలో పడేయకుండా నిర్మాతలు మరియు తారాగణం ఎటువంటి ప్రోమోషన్స్ లోను పాల్గొవటంలేదు అన్నది తెల్సిన విషయమే. కాగా ముఖ్య తారాగణం గా ఉన్న దీపికా - షాహిద్ మరియు రణ్ వీర్ తమ వేరే సినిమాలలో బిజీ అయిపోయారు.

ఇదిలా ఉండగా.. సొట్టబుగ్గల సుందరి దీపికా పదుకొనె కూడా షూటింగ్స్ తో బిజీ అయ్యింది. ఈ మధ్యనే పారిస్ వెళ్లి ఒక యాడ్ ను షూట్ చెయ్యటం జరిగింది. ఈ యాడ్ లో తనతో పాటు నటించిన మోడల్ ఒకతను దీపికా తో నటించటం చాలా ఆనందంగా ఉందని సెట్స్ లో బాగా ఎంజాయ్ చేశామని సోషల్ మీడియా ద్వారా చెప్పి తమ యాడ్ కు సంబందించిన ఒక ఫోటో ను కూడా పోస్ట్ చేయడం జరిగింది. ఇందులో దీపికా ఎరుపు రంగు సింగిల్ పీస్ డ్రస్ లో చాలా హాటుగా కనిపిస్తోంది. ఆ మోడల్ వైపు చూస్తూ నవ్వుతూ కనిపించిన దీపికా ను చూసి మేము కూడా ప్రేమలో పడిపోయాం అంటున్నారు చూస్తున్న జనాలు.

యాడ్ షూటింగ్స్ అన్ని ముందు పూర్తి చేద్దాం అని ఫిక్స్ అయినట్టున్న దీపికా మొన్ననే ఒక యాడ్ లో రౌడి పోలీస్ ఆఫీసర్ లా కనపడి మనల్ని మెప్పించింది. ఇపుడు మళ్ళీ ఇలా మెరిసింది. ఎపుడో డిసెంబర్ 1న విడుదల అవ్వాల్సిన పద్మావతి ఇపుడు పద్మావత్ గా మారి జనవరి 25న రానుండగా మూవీ యూనిట్ తో సహా అందరూ ఆతృతగా వేచి చూస్తున్నారు.