Begin typing your search above and press return to search.
ఎంతైనా సొంతమనిషి సొంతమనిషే!
By: Tupaki Desk | 8 April 2015 3:10 AM GMTహాస్పిటల్ ఆపరేషన్ థియేటర్ నుండి సెల్ఫీ తీసి మరీ ట్విట్టర్ లో పోస్ట్ చేసిన రణవీర్ సింగ్ హాస్పటల్ నుండి డిస్చార్జ్ అయ్యారు. అయితే రణవీర్ సింగ్ కి ఆపరేషన్ అయిన తర్వాత ఒక రోజంతా తోడుగా నీడగా దగ్గరే ఉండి చూసుకుంది ఎవరో తెలుసా? దీపికా పదుకునే! తాజాగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కానీ... హాస్పటల్ నుండి రణవీర్ డిస్చార్జ్ అయ్యే సమయంలో మాత్రం దీపిక కనిపించలేదు. దీనిపై ఆరాతీసిన మీడియా జనాలకు... దీపికా వెనక వైపు ద్వారం గుండా బయటకు వెళ్లిపోయిందని సమాధానం వచ్చిందట హాస్పటల్ సిబ్బంది నుండి! వీరి ప్రేమబంధం గురించి ఎవరెంత రాసినా.. మౌనాన్నే సమాధానం గా చేసుకుంటూ వచ్చినా కానీ... తాజాగా దీపిక, రణవీర్ సింగ్‌కు తోడుగా ఆసుపత్రిలోనే ఉంది అనే విషయంతో ఎవరికైన ఏమైనా సందేహాలుంటే అవి కూడా తీరిపోయాయి! పరాయివాళ్లు అనుకునేవారంతా వచ్చి చూసి పలకరించి వెళ్లిపోతారు, లేదా ఫోన్ చేసో, ఎస్సెమ్మెస్ పంపో సానుభూతి ప్రకటిస్తారు. కానీ... సొంత మనుష్యులే కదా ఇలా దగ్గరుండి చూసుకుంటారు? మీరేమంటారు?