Begin typing your search above and press return to search.

టాటూ తీసినందుకే మెడపై బ్యాండేజ్!?

By:  Tupaki Desk   |   22 Feb 2018 4:31 AM GMT
టాటూ తీసినందుకే మెడపై బ్యాండేజ్!?
X
బాలీవుడ్ టాప్ బ్యూటీ దీపికా పదుకునే ఇప్పుడు ఫుల్లు ఫాంలో ఉంది. పద్మావత్ మూవీ సక్సెస్ ను ఆమెను మరింత ఉన్నత స్థానానికి తీసుకెళ్లింది. కొన్ని పాత జ్ఞాపకాలను తొలగించుకునే పనిలో పడిందనే అనుమానాలు కలుగుతున్నాయి.

ప్రస్తుతం ఈ బ్యూటీ.. బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ తో రిలేషన్ షిప్ లో ఉందనే విషయం బహిరంగ రహస్యం. అయితే.. అంతకు ముందు ఈ భామ రణబీర్ కపూర్ తో కొంతకాలం ప్రేమాయణం జరిపింది. ఈ విషయాన్ని ఆమె దాచుకోలేదు కూడా. తన మెడపై ఆర్.కె. అనే అక్షరాలను టాటూ వేయించుకుంది కూడా. అయితే.. రణబీర్ తో బ్రేకప్ అయిన తర్వాత కూడా దాన్ని తొలగించుకునే ప్రయత్నం చేయలేదు. ఆ అవసరం లేదని కూడా ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది. కానీ ఇప్పుడు తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లుగా కనిపిస్తోంది.

రీసెంట్ గా దీపికా పదుకొనే ముంబై ఎయిర్ పోర్టులో కనిపించింది. ఈ సందర్భంగా ఫోటోగ్రాఫర్స్ తీసిన చిత్రాలలో ఆమె మెడ భాగంపై ఓ పెద్ద బ్యాండేజ్ కనిపించింది. ఇదే ప్రదేశంలో ఆర్.కె. అనే టాటూ ఉంటుంది. దాన్ని తొలగించుకోవడంలో భాగంగానే ఇలా బ్యాండేజ్ వేసుకోవాల్సి వచ్చిందనే టాక్ వస్తోంది. హైద్రాబాద్ కు వచ్చే సమయంలో ఈ ఫోటోలు తీయగా.. వేరే చిన్న పాటి స్కిన్ ఎలర్జీ కారణంగానే టాటూ వేసుకుందనే టాక్ కూడా వినిపిస్తోంది.