Begin typing your search above and press return to search.

స్టార్ హీరోయిన్ అవి దొంగతనం చేస్తుందట!

By:  Tupaki Desk   |   3 Aug 2019 4:08 PM GMT
స్టార్ హీరోయిన్ అవి దొంగతనం చేస్తుందట!
X
మన సీక్రెట్స్.. అల్లరి పనులు.. మనలోని అపరిచితవ్యక్తి గురించి వివరాలు ఈ ప్రపంచంలో ఎవరికి తెలిసి ఉంటాయి.. ఇంకెవరికి? మన స్నేహితులకే. అయితే ఒక్కోసారి మనల్ని ఆటపట్టించాలనో.. లేదా ఏమరుపాటులోనో మన రహస్యాలను వెల్లడిస్తారు. రేపు ప్రపంచ వ్యాప్తంగా ఫ్రెండ్ షిప్ డే జరుపుకుంటున్నారు. దీంతో సోషల్ మీడియాలో రేపు ఫ్రెండ్స్ హంగామా ఎక్కువగా ఉండబోతోంది. ఆదివారం దాకా ఎందుకు.. అంతలోపే ఫ్రెండ్స్ హంగామా మొదలైంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికకు క్లోజ్ ఫ్రెండ్ పేరు స్నేహ రామచందర్. ఆమె తాజాగా ఒక బాంబు పేల్చింది.

దీపికకు చిన్నప్పటి నుంచి ఆమె జిగ్రీ దోస్తు అంట. థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ తరహాలో దీపిక - స్నేహలది థర్టీ ఇయర్స్ ఫ్రెండ్ షిప్. స్నేహ తాజాగా దీపికకు సంబంధించిన వెబ్ సైట్ లో ఒక లేఖ రాసింది. ఇందులో ఆమె దీపిక గురించి మంచి విషయాలతో పాటు సీక్రెట్లు కూడా పంచుకుంది. దీపిక తమ మధ్య ఉంటే ఒక వెచ్చని కౌగిలి లాగా.. హాట్ కాఫీ తాగినట్టు ఉంటుందని ప్రశంసలు కురిపించింది. గంటల తరబడి కబుర్లు చెప్తున్నప్పుడు దీపిక కంపెనీ ఎంత అందంగా ఉంటుందో.. ఏం మాట్లాడకుండా మౌనంగా కూర్చుంటే కూడా అంతే అందంగా ఉంటుందట.

అన్నీ మంచి విషయాలే కదా.. ఇంకేముంది అనుకున్నారా? అక్కడే ఉంది ట్విస్ట్. దీపిక షూటింగ్ కోసం కానీ.. వ్యక్తిగతంగా కానీ ఇతర నగరాలకు.. దేశాలకు ప్రయాణాలు చేసినప్పుడు హోటల్స్ లో ఉండాల్సి వస్తుంది కదా. అక్కడనుంచి చిన్నసైజు షాంపూ బాటిల్స్ ను సేకరిస్తుందట. సేకరణ అంటే అదేదో స్టాంప్ కలెక్షన్స్ టైపు అనుకోకండి.. షాంపూ బాటిల్స్ దొంగతనం చేయడం! సిల్వర్ స్క్రీన్ పై మహారాణిలా మెరిసే దీపిక లోపల చిలిపి కృష్ణయ్య తరహాలో ఈ షాంపూ దొంగ ఉందన్నమాట. కాకపోతే కృష్ణయ్యది వెన్న దొంగతనం.. దీపిక మాత్రం బుజ్జి షాంపూలు.. అదే తేడా.