Begin typing your search above and press return to search.

తొలిముద్దు గుట్టు.. తెలివిగా విప్పేసింది

By:  Tupaki Desk   |   28 Sep 2016 1:30 AM GMT
తొలిముద్దు గుట్టు.. తెలివిగా విప్పేసింది
X
కేరక్టర్ డిమాండ్ చేసినా.. సిట్యుయేషన్స్ డిమాండ్ చేసినా .. లిప్ లాక్స్ కి- రివీలింగ్ డ్రెస్సులకు ఏ మాత్రం అబ్జెక్షన్ చెప్పదనే దీపికా పదుకొనేకి మరో గుర్తింపు కూడా ఉంది. ఆన్ స్క్రీన్ పై అంతగా రెచ్చిపోయి నటించే ఈ భామ.. నిజానికి చాలా సిగ్గరి అంటారు సినీ జనాలు. తన వ్యక్తిగత జీవితం గురించి అంత తేలిగ్గా మాట్లడలేదని.. వీలైనంత వరకూ అవాయిడ్ చేసేందుకే ట్రై చేస్తుంది కూడా.

ప్రముఖ మేగజైన్ వోగ్.. 'వోగ్ బీఎఫ్ ఎఫ్స్'అంటూ ఓ సరికొత్త టాక్ షో స్టార్ట్ చేసింది. ఓ సెలబ్రిటీని షోలో కూర్చోబెట్టి.. ఆమె బెస్ట్ ఫ్రెండ్స్ తో ర్యాపిడ్ ఫైర్ రౌండ్ క్వశ్చన్స్ అడిగించడం.. తెలిసిన విషయాల వెనక దాగిఉన్న తెలియని సంగతులను చెప్పించడం ఈ షో కాన్సెప్ట్. కలర్స్ ఇన్ఫినిటీలో ఈ కార్యక్రమం ప్రసారం అవుతుండగా.. తొలి ఎపిసోడ్ లో దీపికా పదుకొనే.. బోలెడన్ని కబుర్లు చెప్పేసింది. అందులో తనకు నచ్చాలంటే ఆ మగాడు ఎలా ఉండాలి నుంచి.. తొలి ముద్దు వరకూ చెప్పేసింది.

బ్రాడ్లే కూపర్ దీపికకు ఫస్ట్ క్రష్ కాగా.. ఫస్ట్ కిస్ సంగతి వచ్చేసరికే దీపిక ఆలోచనలో పడిపోయింది. ఆన్ స్క్రీన్ లు ముద్దులు బాగానే పంచిన ఈమె.. ఆఫ్ స్క్రీన్ లో ఫస్ట్ కిస్ ఎవరికిచ్చిందనే ప్రశ్నకు మాత్రం.. అప్పటికి నేనింకా చిన్నపిల్లనే అంటూ చిన్నపాటి షాక్ ఇచ్చింది. అప్పట్లోనే ఎవరికిచ్చావ్ దీపికా అంటే మాత్రం.. 'ఇంకెవరికీ నా పేరెంట్స్ కే' అంటూ అసలు విషయం చెప్పకుండా ఎస్కేప్ అయిపోయింది దీపికా పదుకొనే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/