Begin typing your search above and press return to search.

దేవదేవుని చెంతకు దీపిక!!

By:  Tupaki Desk   |   10 Nov 2017 1:05 PM GMT
దేవదేవుని చెంతకు దీపిక!!
X
బాలీవుడ్ భామ దీపికా పదుకొనేకు ఇప్పుడు భక్తి బాగా ఎక్కువయిపోతోంది. అటు తన ఆధ్యాత్మిక చింతనను పూర్తి చేసుకోవడంతో పాటు.. ఇటు తను నటించిన మూవీ పద్మావతి సక్సెస్ కావాలంటూ గుళ్ల చుట్టూ తెగ ప్రదక్షిణలు చేసేస్తోంది. రీసెంట్ గా అమృత్ సర్ లోని గోల్డెన్ టెంపుల్.. అజ్మీర్ లోని దర్గాలలో ప్రార్ధించిన దీపిక.. ఇప్పుడు తిరుమలలో ప్రత్యక్షం అయిపోయింది.

దీపికా పదుకొనే ఇండస్ట్రీలోకి వచ్చి 10 ఏళ్లు గడిచిపోయింది. 2007లో వచ్చిన షారూక్ ఖాన్ మూవీ ఓం శాంతి ఓం మూవీతో బాలీవుడ్ లో అడుగు పెట్టిన ఈ భామ.. ఇప్పుడు 10ఏళ్ల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ సందర్భంతో పాటు.. వచ్చే నెల 1న విడుదల కానున్న తన భారీ బడ్జెట్ మూవీ పద్మావతి కోసం పూజలు చేసేందుకు.. తిరుమలకు విచ్చేసింది దీపిక. తన తొలి డైరెక్టర్ అయిన ఫరాఖాన్ ను కూడా వెంట తీసుకురావడం విశేషం. ఇద్దరూ కలిసి దేవదేవుని సన్నిధిలో కాసేపు పూజలు నిర్వహించారు కూడా. వైట్ డ్రెస్ లో దీపిక.. వెంకన్న దర్శనం చేసుకుంటే.. క్యాజువల్ పర్పుల్ సూట్ లో ఫరా ఖాన్ వచ్చింది.

ఇక డిసెంబర్ 1న విడుదల కానున్న పద్మావతి మూవీపై అంచనాలు భారీగా ఉండడమే కాదు.. వివాదాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఈ సినిమాలో అల్లావుద్దీన్ ఖిల్జీ పాత్రలో నటించిన రణవీర్ సింగ్ తో పద్మావతి సన్నిహితంగా ఉండే సన్నివేశాలు ఉన్నాయంటూ.. పలువురు ఈ చిత్రాన్ని అడ్డుకుని తీరతామని హెచ్చరిస్తున్నారు.