Begin typing your search above and press return to search.
ఇది ప్రస్తుతం మన టాలీవుడ్ స్థాయి
By: Tupaki Desk | 26 Feb 2020 12:30 AM GMTగతంతో పోల్చితే ప్రస్తుతం మన టాలీవుడ్ స్థాయి చాలా పెరిగింది. గతంలో తెలుగు సినిమాలనే కాకుండా సౌత్ భాషల సినిమాలన్నింటిని కూడా హిందీ ఫిల్మ్ మేకర్స్ మరియు స్టార్స్ చిన్న చూపు చూసేవారు. మణిరత్నం.. శంకర్.. రాజమౌళి వంటి స్టార్ డైరెక్టర్స్ మన తెలుగు సినిమా స్థాయిని బాలీవుడ్ ను మించేలా చేశారు. అందుకే ఇప్పుడు పలువురు బాలీవుడ్ స్టార్స్ కూడా సౌత్ లో నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు.
ఇప్పటికే పలువురు బాలీవుడ్ స్టార్స్ సౌత్ ఫిల్మ్ మేకర్స్ తో కలిసి వర్క్ చేస్తున్నారు. తాజాగా ఆ జాబితాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనె కూడా చేరిపోయింది. ఈమె తాజాగా 83 చిత్రంలో నటించింది. ఆ సినిమా విడుదల నేపథ్యంలో మీడియాతో ఇంట్రాక్షన్ అయ్యింది. ఆ సందర్బంగా ఈమె మాట్లాడుతూ టాలీవుడ్ లో నటించాలని కోరుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చింది. తెలుగు సినిమాలు నచ్చుతాయి అన్న దీపిక మహేష్ బాబు అంటే ఇష్టం అంటూ చెప్పుకొచ్చింది.
తెలుగులో నటించాలనుకుంటున్నాను. మంచి కథ కోసం ఎదురు చూస్తున్నాను. మంచి కథతో వస్తే తప్పకుండా తెలుగులో నటిస్తానంది. సౌత్ సినిమాల్లో నటించడానికి తనకు ఎలాంటి ఇబ్బంది లేదు. భాషతో సంబంధం లేకుండా మంచి పాత్రలు చేయాలనేది తన ఉద్దేశ్యం అంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో భాషతో సంబంధం లేకుండా సినిమాలు అన్ని భాషల్లో కూడా వెళ్తున్నాయి. అందుకే దీపిక సౌత్ లో కూడా నటించాలని అనుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చింది. మరి ఈమెను మెప్పించే కథతో మనవాళ్లు ఎవరైనా వెళ్తారా చూడాలి.