Begin typing your search above and press return to search.

ఇప్పుడు కొహ్లీ కూడా దీపికా ఫ్యామిలీనే

By:  Tupaki Desk   |   18 Feb 2016 4:07 AM GMT
ఇప్పుడు కొహ్లీ కూడా దీపికా ఫ్యామిలీనే
X
విరాట్‌ కొహ్లీ. క్రికెట్‌ ప్రపంచానికే కాదు.. యావత్‌ ఇండియాకు పరిచయం అక్కర్లేని పేరు. అయితే ఈ మధ్యన మనోడు హీరోయిన్‌ అనుష్క శర్మతో బ్రేకప్‌ అయ్యాడు అనే న్యూస్‌ బయటకొచ్చాక మాత్రం.. యావత్‌ ఇండియా ఎప్పుడెప్పుడు మనోడి నోటితో సదరు బ్రేకప్‌ గురించి తెలుసుకుందామా అని ఎదురు చూస్తున్నారు. ఈలోపు సడన్‌ గా హీరోయిన్‌ దీపికేమో.. కొహ్లీ వెల్‌ కమ్‌ టు అవర్‌ ఫ్యామిలీ అనేసింది. ఏంటీ కథ? లెటజ్‌ సీ.

ఇకపోతే నిన్ననే ఈ చిచ్చర పిడుగు బ్యాట్స్‌ మ్యాన్.. టిస్సాట్‌ వాచీలకు.. ఇండియా బ్రాండ్‌ అంబాసిడర్‌ గా సైన్‌ చేశాడు. ఇప్పటికే ఈ వాచీలకు సెక్సిణి దీపికా పదుకొనె బ్రాండ్‌ అంబాసిడర్‌ గా ఉంది. ఈ తరుణంలో విరాట్‌ ను కూడా మరో అంబాసిడర్‌ గా ఎప్పాయింట్‌ చేయడంతో.. వెల్కమ్‌ టు ఫ్యామిలీ అనేసింది దీపు. అంతకు మించి ఇక్కడ మరో గాసిప్పుకు చోటులేదండోయ్‌.

ఇదంతా ఒకెత్తయితే.. మీరు ఈ వాచ్‌ ను ఎవరైనా ''సెలబ్రిటీ హీరోయిన్‌''కు గిఫ్ట్ ఇస్తారా అని అడిగితే.. ''మీకేమన్నాపిచ్చా.. ఏం. .ఇంట్లో వాళ్ళకి కానుకగా ఇవ్వకూడదా.. లేదంటే ఎవరన్నా క్రికెట్‌ స్టార్‌ కు ఇవ్వొచ్చుగా. ఏదేదో ప్రశ్నలు అడగాలని ప్రయత్నిస్తుంటారెందుకు?'' అంటూ మీడియాపై విరుచుకుపడ్డాడు.