Begin typing your search above and press return to search.
అరుంధతికి పద్మావతి అయితేనే కరెక్ట్ సెట్
By: Tupaki Desk | 23 July 2020 11:30 AM GMTటాలీవుడ్ లో అరుంధతి చిత్రం వచ్చి 11 ఏళ్లు అవుతుంది. అయినా కూడా సినిమాకు ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. బుల్లి తెరపై ఇప్పుడు అరుంధతి వచ్చినా కూడా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిని కనబర్చుతున్నారు. అంతటి సక్సెస్ అయిన అరుంధతిని బాలీవుడ్ లో రీమేక్ చేసే అవకాశం ఉంది అంటూ చాలా ఏళ్లుగా వార్తలు వస్తున్నాయి. ఎట్టకేలకు ఈ చిత్రంను బాలీవుడ్ కు అల్లు అరవింద్ తీసుకు వెళ్లబోతున్నాడు. మధు మంతెనతో కలిసి ఈ సినిమాను రీమేక్ చేసే ఉద్దేశ్యంలో అల్లు అరవింద్ ఉన్నాడు. రీమేక్ విషయమై ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయి.
అరుంధతిలో అనుష్క ద్వి పాత్రాభినయం చేసి మెప్పించింది. హిందీలో సినిమాకు క్రేజ్ రావాలన్నా ఆ పాత్రలను చేయాలన్నా ముఖ్యంగా జేజమ్మ పాత్రను చేయాలంటే పవర్ ఫుల్ నటి అయ్యి ఉండాలి. జేజమ్మ పాత్రను కేవలం దీపిక పదుకునే మాత్రమే చేయగలదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. పద్మావత్ చిత్రంలో ఆమె నటన చాలా బాగుంటుంది. నటిగా దీపిక పదుకునే ఉన్నత శిఖరాలను అధిరోహించింది. అందుకే అరుంధతికి ఆమె అయితేనే సెట్ అవుతుందనే అభిప్రాయంలో చాలా మంది ఉన్నారు.
అల్లు అరవింద్ కూడా ఈ రీమేక్ కు ఆమె అయితే బాగుంటుందని అనుకుంటున్నాడట. మరి దీపిక పదుకునే అందుకు ఒప్పుకుంటుందా అనేది తెలియాల్సి ఉంది. ఒక వేళ దీపిక పదుకునే ఒప్పుకున్నా పారితోషికం విషయంలో నిర్మాతలకు షాక్ ఇచ్చే అవకాశం ఉంది. మరి అంతటి పారితోషికంతో అల్లు అరవింద్ రీమేక్ కు సిద్దం అయ్యేనా అనే విషయంపై కూడా క్లారిటీ రావాల్సి ఉంది. గతంలో గజినీ చిత్రంను బాలీవుడ్ లో రీమేక్ చేసి సక్సెస్ అయిన అల్లు అరవింద్ మళ్లీ అక్కడ వరుసగా రీమేక్ లు చేస్తున్నాడు. ఒక వైపు జెర్సీ రీమేక్ తెరకెక్కుతుంది. ఇదే సమయంలో అరుంధతిని తీసుకు వెళ్లేందుకు సిద్దం అయ్యాడు.