Begin typing your search above and press return to search.
నాలుగేళ్ల క్రితమే నిశ్చితార్థం?
By: Tupaki Desk | 28 Dec 2018 5:02 PM GMTదీప్- వీర్ జంట వివాహ మహోత్సవం ఎంత ఉల్లాసంగా జరిగిందో తెలిసిందే. 2018 ఆరంభం నుంచి ఈ జంట పెళ్లికి ఏర్పాట్లు సాగుతూనే ఉన్నాయి. ఇరు కుటుంబాలు ఎంతో పకడ్భందీ ప్రణాళికతో ఎట్టకేలకు నవంబర్ లో ఇటలీలో పెళ్లి వేడుకను ముగించాయి. అయితే పెళ్లి తర్వాత రణవీర్ బిజీ బిజీ. అందుకే కొంత గ్యాప్ ఇచ్చి కొత్త జంట హనీమూన్ ప్లాన్స్ లో ఉన్నారు.
ఆసక్తికరంగా ఓ ఇంటర్వ్యూలో తమ ప్రేమ వ్యవహారం గుట్టు మట్ల గురించి దీపిక దాచుకోకుండా పలు ఆసక్తికర సంగతుల్ని తెలిపింది. వాస్తవానికి మా నిశ్చితార్థం నాలుగేళ్ల కిందటే జరిగిపోయింది అంటూ దీపిక పెద్ద షాకిచ్చే నిజం చెప్పింది. అప్పట్లో సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాం. యశ్ రాజ్ స్టూడియోస్ లో షూటింగ్ జరుగుతోంది. ఆ టైమ్ లో రణవీర్ నన్ను ఫ్లిర్ట్ చేసేవాడు. కొంటెగా కవ్విస్తూ చాలానే చేశాడు. గురుడు గాలం వేయడంలో మాంచి వేటగాడే. అప్పుడే మా నిశ్చితార్థం అయిపోయింది! అని దీపిక పాత జ్ఞాపకాల్లోకి వెళ్లింది.
ఒకసారి భన్సాలీతో భోజనం చేస్తుండగా జరిగిన సంఘటనను దీపిక గుర్తు చేసుకుంది. ఆ రోజు లంచ్ చేస్తున్నప్పుడు ఒక పీత ఒకటి నా పంటిలో చిక్కుకుపోయింది. ఆ సీన్ లో నన్ను ఏడిపించేందుకు ప్రయత్నించాడు. ``పంటి కింద పీత చిక్కుకుంది!`` అంటూ ఆట పట్టించాడు. అతడు అలా చేస్తుంటే ``వచ్చి తియ్!`` అంటూ అడిగాను.. అని నవ్వేసింది. ఇప్పుడైనా అర్థమైందా.. నిశ్చితార్థం పరమార్థమేంటో?