Begin typing your search above and press return to search.

ఏంటీ.. ఆ మాత్రానికే చంపేస్తారా?

By:  Tupaki Desk   |   18 Nov 2017 10:55 AM GMT
ఏంటీ.. ఆ మాత్రానికే చంపేస్తారా?
X
బాలీవుడ్ అందాల భామ దీపికా పదుకొనే నటించిన పద్మావతి చిత్రం రిలీజ్ కి రెడీ అయిపోయింది. మరో రెండు వారాల్లో థియేటర్లలోకి వచ్చేసేందుకు సినిమా సిద్ధమైపోయింది. అయితే.. ఇప్పుడీ సినిమాపై చెలరేగుతున్న వివాదాలు మామూలుగా లేవు. ఇప్పటివరకూ ఏ ఇండియన్ మూవీకి ఇంతగా వ్యతిరేకత ఎదురుకాలేదేమో అనిపించక మానదు.

ఆయా సినిమాలను అడ్డుకుంటామనే హెచ్చరికలు.. కొన్ని దాడులు చూసిన సందర్భాలు ఉన్నాయి కానీ.. ఏకంగా పద్మావతిగా నటించిన దీపికా పదుకొనే తలను.. ఆ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తలను నరికి తెచ్చి ఇచ్చిన వారికి 5 కోట్ల రూపాయల గిఫ్ట్ ఇస్తామని ప్రకటించడం పెద్ద సెన్సేషన్ అయింది. "ఓ సినిమా తీస్తే.. ఆ సినిమాలో నటిస్తేనే చంపేస్తారా.. అసలు మన దేశంలో ప్రజాస్వామ్యం ఉందా"అంటున్న భన్సాలీ.. తమ సినిమా కచ్చితంగా అన్ని అడ్డంకులు దాటి రిలీజ్ అవుతందని అంటున్నాడు. మరోవైపు దీపిక కూడా ఈ వివాదంపై రియాక్ట్ అయింది.

'అసలు మూవీలో కంటెంట్ ఏంటో తెలియకుండా.. ఆ సినిమాకు చెందిన వ్యక్తుల తలలకు రేటు కట్టడం మరీ ఆటవిక వ్యవహారం. నా ముక్కు కోస్తామని కొందరు.. తల నరుకుతామని మరికొందరు అంటున్నారు. మన దేశంలో ఏం జరుగుతోందసలు. మనుషులు మానవుల్లా ప్రవర్తిస్తున్నారా' అంటూ నిలదీసింది పద్మావతి పాత్రధారి దీపికా పదుకొనే.