Begin typing your search above and press return to search.

11 కోట్లు రూమర్లే అయితే.. నిజమెంతో?

By:  Tupaki Desk   |   31 Aug 2016 7:30 AM GMT
11 కోట్లు రూమర్లే అయితే.. నిజమెంతో?
X
బాలీవుడ్ కం హాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనే.. రెమ్యూనరేషన్ విషయంలో చాలా స్ట్రిక్ట్ అనే విషయం ఇప్పటికే తేలిపోయింది. భారీగా పారితోషికం పుచ్చుకోవడం విషయంలో ఈమె ఇండియాలోనే ఫస్ట్ అయితే.. ప్రపంచవ్యాప్తంగా పదో ర్యాంకులో ఉందని ఫోర్బ్స్ పత్రిక కోడై కూసేసింది. ఈమె రేంజ్ ఏ స్థాయిలో వెలిగిపోతోందంటే.. ఓ సినిమా నటించేందుకు తన ప్రియుడు కం హీరో అయిన రణవీర్ సింగ్ కంటే ఎక్కువ మొత్తం పుచ్చుకుంటోందనే టాక్ ఉంది.

పద్మావతి టైటిల్ పై భారీ చిత్రాన్నితలపెట్టాడు సంజయ్ లీలా భన్సాలీ. ఇందులో నటించేందుకు రణవీర్ కు 7-8 కోట్లు ఇస్తుంటే.. దీపికాకు ట్యాక్సులు పోను 11 కోట్లు ముట్టచెబుతున్నారనే టాక్ ఉంది. అయితే.. మొహెంజొదారో లాంటి పీరియాడిక్ ఫిలిం రిజల్ట్ తర్వాత.. నిర్మాణ సంస్థ ఈరోస్ జాగ్రత్తలు తీసుకుంటోందని.. అందులో భాగంగా దర్శకుడు భన్సాలీని నిర్మాణ ఖర్చులు తగ్గించాలని రిక్వెస్ట్ చేసినట్లుగా వార్తలు వచ్చాయి. ఇవన్నీ భన్సాలీ అండ్ టీమ్ ని బాగానే కదిలించాయి. అందుకే హీరోయిన్ రెమ్యూనరేషన్ పై ఇప్పుడో స్టేట్మెంట్ కూడా ఇచ్చేశారు.

'పద్మావతిలో నటిస్తున్న స్టార్లకు ఇస్తున్న రెమ్యూనరేషన్ పై వస్తున్న వార్తలన్నీ అసత్యాలే. ఎలాంటి ఆధారం లేని రూమర్స్ ను దయచేసి నమ్మవద్దు'.. ఇదీ సంజయ్ లీలా భన్సాలీ తరఫున ఇచ్చిన స్టేట్మెంట్. అది ఓకే అనుకుంటే.. 11 కోట్లు ఇవ్వట్లేదు.. అంతా రూమర్లే.. అయితే ఎంతిస్తున్నారు బాసూ?