Begin typing your search above and press return to search.

వీడియో: మాజీ లవర్ తో డ్యాన్స్.. భర్త ఎంకరేజ్మెంట్!

By:  Tupaki Desk   |   1 Jun 2019 8:02 AM GMT
వీడియో: మాజీ లవర్ తో డ్యాన్స్.. భర్త ఎంకరేజ్మెంట్!
X
బాలీవుడ్ పవర్ కపుల్స్ లో దీపిక పదుకొనె- రణవీర్ సింగ్ జంట ఒకరు. వీరిద్దరి మధ్యలో ఉందే కెమిస్ట్రీ.. ఫిజిక్సు.. అన్నీ సాధారణ జనాలకు అర్థం కావు. ఒకరంటే ఒకరు పడి చచ్చిపోతారు. కొద్దిరోజుల క్రితం రణవీర్ తన సతీమణి చెప్పులు మోసి తన ప్రేమను బహిరంగంగా వ్యక్తపరిచాడు. ఇక తాజాగా మరోసారి తన భార్య డ్యాన్స్ కు ఇచ్చిన ప్రోత్సాహంతో వార్తల్లో నిలిచాడు.

జస్ట్ దీపిక వేసే డ్యాన్స్ కు ప్రోత్సాహం ఇస్తే హాట్ టాపిక్ ఎందుకు అవుతుంది? దీపిక.. ఆమె మాజీ లవర్ రణబీర్ కపూర్ కలిసి 'ఏ జవాని హై దీవాని' అనే సూపర్ హిట్ సినిమా నుండి 'బలమ్ పిచికారి' అనే చార్ట్ బస్టర్ పాటకు రచ్చగా డ్యాన్స్ చేశారు. ఆ పాట ఎవరిదో కాదు.. వారిద్ధరిదే. ఆ పాటకు ఇద్దరూ రెచ్చిపోయి రచ్చ స్టెప్పులు వేస్తుంటే రణవీర్ ఎంకరేజ్ మెంట్ అందిస్తూ 'యా బేబీ!' అంటూ ఒక సాధారణ ప్రేక్షకుడిలా ఎగ్జైట్ అయ్యాడు. వీడియో చూసే సమయంలో రణవీర్ ఎక్కడున్నాడని తెలుసుకోవాలంటే మనం కష్టపడి స్కానింగ్ చెయ్యాల్సిందే. ఆయన వాయిస్ మాత్రమే క్లియర్ గా వినిపిస్తుంది.

డ్యాన్స్ వేయకుండా పక్కనున్న భర్తగారి సంగతి పక్కన పెడితే రణబీర్ - దీపికలు మాత్రం డ్యాన్స్ ను ఇరగదీశారు. ఇంతకీ ఈ అమూల్యమైన వీడియోను చిత్రీకరించింది ఎవరో.. కొంపదీసి అలియా భట్ కాదు కదా? తప్పేమీ లేదు.. బాలీవుడ్ చాలా మోడరన్.. ఆమె వీడియో తీసినా మీరేమీ అవాక్కవ్వాల్సిన అవసరమే లేదు. అంతేగా అంతేగా అని సరిపెట్టుకోవడమే!

For Video Click Here