Begin typing your search above and press return to search.
వైద్యం అందించాలని, టెస్టులు చేయాలని సీఎంకు సీరియల్ నటి విజ్ఞప్తి
By: Tupaki Desk | 13 Jun 2020 12:10 PM GMTవైరస్ బారిన తమ తల్లి పడడంతో తమ కుటుంబసభ్యులకు వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయాలని ముఖ్యమంత్రికి ఓ సీరియల్ నటి కోరారు. దీనికి సంబంధించి ఓ వీడియోను తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసి కోరింది.
ఢిల్లీలో పరిస్థితులు ఘోరంగా ఉన్నాయి. వైరస్ తీవ్రంగా వ్యాపిస్తోంది. ఈ క్రమంలోనే ఔర్ బాటి హమ్ సీరియల్‌లో నటిస్తున్న దీపికా సింగ్ తల్లి వైరస్ బారిన పడింది. పాజిటివ్ తేలడంతో ఢిల్లీలో ఉంటున్న తన తల్లితండ్రులకు వైద్య చికిత్స అందించాలని విజ్ఞప్తి చేసింది. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను కోరింది. దీనికి సంబంధించి ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె ఓ వీడియోను పోస్టు చేసింది.
తమది ఉమ్మడి కుటుంబం అని, తమ ఇంట్లో 45 మంది ఉంటారని, 55 ఏళ్ల తన తల్లికి పాజిటివ్ వచ్చిందని వివరించారు. ఢిల్లీలోని లేడీ హార్డింగే మెడికల్ కాలేజీలో పరీక్షలు జరిపారని, కానీ రిపోర్ట్స్ ఇవ్వలేదని, తల్లికి చికిత్స అందించాలంటూ నటి దీపికా సీఎంను కోరింది. తన తల్లి ఎప్పుడూ బయటకు వెళ్లలేదని, కానీ ఆమెకు ఎలా వైరస్ సోకిందో అర్థం కాలేదని వాపోయింది ఈ నేపథ్యంలో తమ కుటుంబసభ్యులకు కూడా నిర్ధారణ పరీక్షలు చేయాలని ఇన్ స్టాగ్రామ్ ద్వారా కోరారు.